కీర్తనలు 146:1-10

  • దేవుణ్ణి నమ్ముకోండి, మనుషుల్ని కాదు

    • మనిషి చనిపోయినప్పుడు ఆలోచనలు నశించిపోతాయి (4)

    • కృంగిపోయిన వాళ్లను దేవుడు పైకి లేపుతాడు (8)

146  యెహోవాను* స్తుతించండి!*+ నా ప్రాణమా, యెహోవాను స్తుతించు.+   నా జీవితమంతా నేను యెహోవాను స్తుతిస్తాను. నేను బ్రతికున్నంత కాలం నా దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడతాను.*   రాజుల* మీద గానీ, మనుషుల మీద గానీ నమ్మకం పెట్టుకోకండి,వాళ్లు రక్షణను తీసుకురాలేరు.+   వాళ్ల ఊపిరి* వెళ్లిపోతుంది, వాళ్లు తిరిగి మట్టికి చేరుకుంటారు;+ఆ రోజే వాళ్ల ఆలోచనలు కూడా నశించిపోతాయి.+   సహాయం కోసం యాకోబు దేవునికి మొరపెట్టే వాళ్లు,*+తమ దేవుడైన యెహోవా మీద ఆశపెట్టుకునే వాళ్లు ధన్యులు;*+   ఆయనే భూమ్యాకాశాల్ని,సముద్రాన్ని, వాటిలో ఉన్న వాటన్నిటినీ తయారుచేశాడు,+ఆయన ఎప్పటికీ నమ్మకంగానే ఉంటాడు;+   మోసగించబడిన వాళ్లకు న్యాయం చేసేది,ఆకలిగా ఉన్నవాళ్లకు ఆహారం ఇచ్చేది ఆయనే.+ యెహోవా ఖైదీల్ని* విడుదల చేస్తున్నాడు.+   యెహోవా గుడ్డివాళ్ల కళ్లు తెరుస్తున్నాడు;+యెహోవా కృంగిపోయిన వాళ్లను పైకి లేపుతున్నాడు;+యెహోవా నీతిమంతుల్ని ప్రేమిస్తాడు.   యెహోవా పరదేశుల్ని కాపాడుతున్నాడు;ఆయన తండ్రిలేని పిల్లల, విధవరాళ్ల బాగోగులు చూసుకుంటున్నాడు,+అయితే దుష్టుల పన్నాగాల్ని ఆయన అడ్డుకుంటాడు.*+ 10  యెహోవా ఎప్పటికీ రాజుగా ఉంటాడు,+సీయోనూ, నీ దేవుడు తరతరాలు రాజుగా ఉంటాడు. యెహోవాను* స్తుతించండి!*

అధస్సూచీలు

అక్ష., “యా.” ఇది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.
లేదా “హల్లెలూయా!”
లేదా “సంగీతం వాయిస్తాను.”
లేదా “అధిపతుల; ప్రముఖుల.”
పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.
లేదా “సంతోషంగా ఉంటారు.”
లేదా “యాకోబు దేవుడు తమకు సహాయకుడిగా ఉన్న వాళ్లు.”
అక్ష., “బంధించబడిన వాళ్లను.”
లేదా “దుష్టుల మార్గాన్ని ఆయన వంకర చేస్తాడు.”
అక్ష., “యా.” ఇది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.
లేదా “హల్లెలూయా!”