కీర్తనలు 114:1-8
114 ఇశ్రాయేలు ఐగుప్తు నుండి బయటికి వచ్చినప్పుడు,+యాకోబు ఇంటివాళ్లు వేరే భాష మాట్లాడే ప్రజల దగ్గర నుండి బయటికి వచ్చినప్పుడు
2 యూదా ఆయన పవిత్రమైన స్థలం అయింది,ఇశ్రాయేలు ఆయన రాజ్యం అయింది.+
3 అది చూసి సముద్రం పారిపోయింది;+యొర్దాను నది వెనక్కి మళ్లింది.+
4 పర్వతాలు పొట్టేళ్లలా,కొండలు గొర్రెపిల్లల్లా గంతులు వేశాయి.+
5 సముద్రమా, నువ్వెందుకు పారిపోయావు?+
యొర్దానూ, నువ్వెందుకు వెనక్కి మళ్లావు?+
6 పర్వతాల్లారా, మీరెందుకు పొట్టేళ్లలా గంతులు వేశారు?కొండల్లారా, మీరెందుకు గొర్రెపిల్లల్లా గంతులు వేశారు?
7 భూమీ, ప్రభువును బట్టి,యాకోబు దేవుణ్ణి బట్టి వణుకు.+
8 ఆయన బండరాయిని జమ్ము మడుగుగా,చెకుముకి రాయిని నీటి ఊటలుగా మారుస్తాడు.+