కీర్తనలు 45:1-17

  • అభిషేకించబడిన రాజు పెళ్లి

    • దయగల మాటలు (2)

    • “యుగయుగాలు దేవుడే నీ సింహాసనం” (6)

    • రాజు పెళ్లికూతురి అందాన్ని ఎంతో కోరుకుంటాడు (11)

    • కుమారులు భూమంతటా అధిపతులుగా ఉంటారు (16)

సంగీత నిర్దేశకునికి సూచన; “లిల్లీ పువ్వులు” అనే రాగంలో పాడాలి. కోరహు కుమారుల కీర్తన.+ మాస్కిల్‌.* ప్రేమ గీతం. 45  ఒక మంచి విషయంతో నా హృదయం ఉప్పొంగుతోంది. నా పాట* ఒక రాజు+ గురించినది. నా నాలుక నైపుణ్యంగల లేఖికుడి+ కలంలా+ అవ్వాలి.  2  నువ్వు మనుషులందరిలో అతి సుందరుడివి. నీ పెదాల నుండి దయగల మాటలు జాలువారుతున్నాయి.+ అందుకే దేవుడు శాశ్వతంగా నిన్ను ఆశీర్వదించాడు.+  3  శూరుడా,+ ఘనతను, వైభవాన్ని ధరించి+నీ నడుముకు కత్తి కట్టుకో.+  4  నీ వైభవంతో విజయం వైపు సాగిపో;+సత్యం కోసం, వినయం కోసం, నీతి కోసం స్వారీ చేయి,+నీ కుడిచెయ్యి భీకర కార్యాలు చేస్తుంది.*  5  పదునైన నీ బాణాల వల్ల ప్రజలు నీ ముందు కూలతారు;+ అవి రాజు శత్రువుల గుండెల్లోకి దూసుకెళ్తాయి.+  6  యుగయుగాలు దేవుడే నీ సింహాసనం;+నీ రాజదండం న్యాయమైనది.+  7  నువ్వు నీతిని ప్రేమించావు,+ దుష్టత్వాన్ని ద్వేషించావు.+ అందుకే దేవుడు, నీ దేవుడు నీ తోటివాళ్ల కన్నా ఎక్కువగా నిన్ను ఆనందతైలంతో+ అభిషేకించాడు.+  8  నీ వస్త్రాలన్నీ బోళం, అగరు, లవంగిపట్ట సువాసనతో గుబాళిస్తున్నాయి;వైభవంగల దంతపు రాజభవనం నుండి వచ్చే తంతివాద్యాల సంగీతం నిన్ను ఉల్లాసపరుస్తోంది.  9  ఘనత వహించిన నీ స్త్రీలలో రాజుల కూతుళ్లు ఉన్నారు. రాణి ఓఫీరు బంగారంతో+ అలంకరించబడి నీ కుడివైపున నిలబడింది. 10  నా కుమారీ విను, చెవిపెట్టి శ్రద్ధగా ఆలకించు;నీ ప్రజల్ని, నీ తండ్రి ఇంటిని మర్చిపో. 11  రాజు నీ అందాన్ని ఎంతో కోరుకుంటాడు,ఆయన నీ ప్రభువు,ఆయనకు వంగి నమస్కారం చేయి. 12  తూరు కూతురు కానుక తీసుకొని వస్తుంది;మనుషుల్లో అత్యంత ధనవంతులు నీ అనుగ్రహం కోరుకుంటారు. 13  రాజభవనంలో* రాకుమారి ఎంతో వైభవంగా ఉంది;ఆమె వస్త్రాలు బంగారంతో* అలంకరించబడ్డాయి. 14  నేర్పుగా అల్లిన* వస్త్రాల్లో ఆమె రాజు దగ్గరికి తీసుకురాబడుతుంది. ఆమె వెనక నడుస్తున్న కన్యలైన చెలికత్తెలు ఆయన* ముందుకు తీసుకురాబడుతున్నారు. 15  వాళ్లు సంతోషంగా, ఆనందంగా తీసుకురాబడతారు;వాళ్లు రాజభవనంలోకి ప్రవేశిస్తారు. 16  నీ కుమారులు నీ పూర్వీకుల స్థానంలోకి వస్తారు. నువ్వు వాళ్లను భూమంతటా అధిపతులుగా నియమిస్తావు.+ 17  నేను రాబోయే తరాలన్నిటికీ నీ పేరు తెలియజేస్తాను.+ అందుకే దేశదేశాల ప్రజలు ఎప్పటికీ నిన్ను స్తుతిస్తారు.

అధస్సూచీలు

పదకోశం చూడండి.
అక్ష., “నా పనులు.”
అక్ష., “నీకు నేర్పిస్తుంది.”
అక్ష., “లోపల.”
అక్ష., “బంగారు జవలతో.”
లేదా “బుట్టాపని చేసిన” అయ్యుంటుంది.
అక్ష., “నీ.”