కీర్తనలు 79:1-13

  • దేశాలు దేవుని ప్రజల మీదికి వచ్చినప్పుడు చేసిన ప్రార్థన

    • “మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు” (4)

    • “నీ పేరును బట్టి మాకు సహాయం చేయి” (9)

    • ‘మా పొరుగువాళ్లకు ఏడురెట్లు ఎక్కువ శిక్ష విధించు’ (12)

ఆసాపు+ శ్రావ్యగీతం. 79  దేవా, దేశాలు నీ స్వాస్థ్యంలోకి+ చొరబడ్డాయి;వాళ్లు నీ పవిత్ర ఆలయాన్ని అపవిత్రపర్చారు;+యెరూషలేమును శిథిలాల కుప్పగా మార్చారు.+  2  వాళ్లు నీ సేవకుల శవాల్ని ఆకాశపక్షులకు,నీ విశ్వసనీయుల శరీరాల్ని భూమ్మీది అడవి జంతువులకు ఆహారంగా వేశారు.+  3  వాళ్ల రక్తాన్ని యెరూషలేము చుట్టూ నీళ్లలా పారబోశారు,వాళ్లను పాతిపెట్టడానికి ఎవరూ మిగల్లేదు.+  4  మేము మా పొరుగువాళ్ల దృష్టికి నీచంగా ఉన్నాం;+మా చుట్టూ ఉన్నవాళ్లు మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు, హేళన చేస్తున్నారు.  5  యెహోవా, ఎంతకాలం నువ్వు కోపంగా ఉంటావు? ఎప్పటికీనా?+ ఎంతకాలం నీ ఉగ్రత అగ్నిలా మండుతుంది?+  6  నువ్వు ఎవరో తెలియని దేశాల మీద,నీ పేరున ప్రార్థించని రాజ్యాల మీద నీ ఉగ్రతను కుమ్మరించు.  7  ఎందుకంటే వాళ్లు యాకోబును మింగేశారు,అతని స్వదేశాన్ని నిర్మానుష్యం చేశారు.+  8  మా పూర్వీకుల తప్పుల్ని+ బట్టి మమ్మల్ని శిక్షించకు. త్వరగా మామీద కరుణ చూపించు,+మేము చాలా దయనీయ స్థితిలో ఉన్నాం.  9  మా రక్షకుడివైన దేవా,మహిమగల నీ పేరును బట్టి మాకు సహాయం చేయి;నీ పేరును బట్టి మమ్మల్ని రక్షించు, మా పాపాల్ని క్షమించు.*+ 10  “వాళ్ల దేవుడు ఎక్కడ?” అని దేశాలు ఎందుకు అనాలి?చిందించబడిన నీ సేవకుల రక్తం విషయంలో ప్రతీకారం తీర్చుకోబడిందని దేశాలు తెలుసుకోవాలి, అది మేము కళ్లారా చూడాలి.+ 11  చెరలో ఉన్న వాళ్ల నిట్టూర్పులు నువ్వు వినాలి.+ మరణశిక్ష విధించబడిన వాళ్లను* నువ్వు నీ గొప్ప శక్తితో* కాపాడు.* 12  యెహోవా, మా పొరుగువాళ్లు నీ మీద వేసిన నిందలకు+వాళ్లకు ఏడురెట్లు ఎక్కువ శిక్ష విధించు.+ 13  అప్పుడు, నీ ప్రజలమూ నువ్వు మేపే గొర్రెలమూ అయిన మేము+ఎప్పటికీ నీకు కృతజ్ఞతలు చెల్లిస్తాం;తరతరాలు నిన్ను స్తుతిస్తాం.+

అధస్సూచీలు

అక్ష., “కప్పేయి.”
అక్ష., “మరణ పుత్రుల్ని.”
అక్ష., “బాహువుతో.”
లేదా “విడుదల చేయి” అయ్యుంటుంది.