కీర్తనలు 120:1-7

  • శాంతి కోసం ఒక పరదేశి తపన

    • “మోసం చేసే నాలుక నుండి నన్ను కాపాడు” (2)

    • “నేను శాంతిని కోరుకుంటున్నాను” (7)

యాత్ర కీర్తన.* 120  కష్టాల్లో ఉన్నప్పుడు నేను యెహోవాకు మొరపెట్టాను,ఆయన నాకు జవాబిచ్చాడు.+  యెహోవా, అబద్ధాలాడే పెదాల నుండి,మోసం చేసే నాలుక నుండి నన్ను కాపాడు.  మోసం చేసే నాలుకా, ఆయన నిన్ను ఏం చేస్తాడు?నిన్ను ఎలా శిక్షిస్తాడు?+  యోధుని పదునైన బాణాలతో,+తంగేడు నిప్పులతో+ ఆయన నిన్ను శిక్షిస్తాడు.   అయ్యో నాకు శ్రమ, ఎందుకంటే నేను మెషెకులో+ పరదేశిగా జీవించాను! కేదారు+ డేరాల మధ్య నివసిస్తున్నాను.   శాంతిని ద్వేషించేవాళ్లతోనేను చాలా ఎక్కువకాలంగా నివసిస్తున్నాను.+   నేను శాంతిని కోరుకుంటున్నాను, కానీ నేను ఏం మాట్లాడినావాళ్లు యుద్ధానికి సిద్ధమౌతున్నారు.

అధస్సూచీలు

పదకోశం చూడండి.