కీర్తనలు 129:1-8

  • దాడికి గురైనా ఓడిపోలేదు

    • సీయోనును ద్వేషించేవాళ్లు అవమానాలపాలు అవుతారు (5)

యాత్ర కీర్తన. 129  “చిన్నప్పటి నుండి వాళ్లు నా మీద దాడి చేస్తూ వచ్చారు,”+ అప్పుడు ఇశ్రాయేలు ఇలా అనాలి:   “చిన్నప్పటి నుండి వాళ్లు నా మీద దాడి చేస్తూ వచ్చారు,+కానీ వాళ్లు నా మీద గెలవలేదు.+   పొలాన్ని దున్నినట్టు వాళ్లు నా వీపును దున్నారు;+ఆ చాళ్లు పొడుగ్గా ఉన్నాయి.”   అయితే యెహోవా నీతిమంతుడు;+దుష్టుల తాళ్లను ఆయన తెంపేశాడు.+   సీయోనును ద్వేషించేవాళ్లంతాసిగ్గుపడి అవమానంతో వెనక్కి వెళ్లిపోతారు.+   వాళ్లు, ఇంటి పైకప్పు మీదుండే గడ్డిలా తయారౌతారు;దాన్ని పెరికివేయక ముందే అది వాడిపోతుంది,   కోసేవాడి గుప్పిలి గానీపనల్ని* కూర్చేవాడి ఒడి గానీ దానితో నిండదు.   దారిన పోయేవాళ్లు, “యెహోవా దీవెన నీ మీద ఉండాలి;యెహోవా పేరున నిన్ను దీవిస్తున్నాం” అని అనరు.

అధస్సూచీలు

లేదా “ధాన్యపు వెన్నుల కట్టల్ని.”