కీర్తనలు 122:1-9

  • యెరూషలేము శాంతి కోసం ప్రార్థన

    • యెహోవా మందిరానికి వెళ్లే సంతోషం (1)

    • ఒక్కటిగా జత చేయబడిన నగరం (3)

యాత్ర కీర్తన. దావీదుది. 122  “యెహోవా మందిరానికి వెళ్దాం” అని ప్రజలు నాతో అన్నప్పుడు నేను ​సంతోషించాను.+   యెరూషలేమా, ఇప్పుడుమా పాదాలు నీ గుమ్మాల లోపల ఉన్నాయి.+   యెరూషలేము ఒక్కటిగా జత చేయబడిననగరంలా కట్టబడింది.+   ఇశ్రాయేలుకు ఇవ్వబడిన జ్ఞాపిక ప్రకారంయెహోవా పేరుకు కృతజ్ఞతలు ​చెల్లించడానికిఇశ్రాయేలు గోత్రాలు,యెహోవా* గోత్రాలు అక్కడికి ఎక్కివెళ్లాయి.+   ఎందుకంటే న్యాయపీఠాలు, దావీదు వంశస్థుల సింహాసనాలుఅక్కడ స్థాపించబడ్డాయి.+   యెరూషలేము శాంతి కోసం ప్రార్థించండి.+ నగరమా, నిన్ను ప్రేమించేవాళ్లు ​సురక్షితంగా ఉంటారు.   నీ కోట గోడల్లో శాంతి,నీ పటిష్ఠమైన బురుజుల్లో భద్రత ఇలాగే ఉండిపోవాలి.   నా సహోదరుల కోసం, నా సహవాసుల కోసం, “నీలో శాంతి ఉండాలి” అంటాను.   మా దేవుడైన యెహోవా మందిరం కోసం+నువ్వు వర్ధిల్లాలని ప్రార్థిస్తాను.

అధస్సూచీలు

అక్ష., “యా.” ఇది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.