కీర్తనలు 66:1-20

  • సంభ్రమాశ్చర్యాలు పుట్టించే దేవుని కార్యాలు

    • “వచ్చి, దేవుని పనులు చూడండి” (5)

    • “నా మొక్కుబళ్లు నీకు చెల్లిస్తాను” (13)

    • దేవుడు ప్రార్థనలు వింటాడు (18-20)

సంగీత నిర్దేశకునికి సూచన. గీతం. శ్రావ్యగీతం. 66  భూమ్మీదున్న సమస్త ప్రజలారా, సంతోషంతో కేకలు వేస్తూ దేవుణ్ణి స్తుతించండి.+  2  ఆయన మహిమగల పేరును స్తుతిస్తూ పాటలు పాడండి.* స్తుతిస్తూ ఆయన్ని మహిమపర్చండి.+  3  ఆయనతో ఇలా అనండి: “నీ పనులు ఎంత సంభ్రమాశ్చర్యాలు పుట్టిస్తాయి!+ నీ గొప్ప శక్తిని బట్టి,నీ శత్రువులు వణుకుతూ నీ ముందుకు వస్తారు.+  4  భూమ్మీదున్న వాళ్లందరూ నీకు వంగి నమస్కారం చేస్తారు;+వాళ్లు నిన్ను స్తుతిస్తూ పాటలు పాడతారు;నీ పేరును స్తుతిస్తూ పాటలు పాడతారు.”+ (సెలా)  5  వచ్చి, దేవుని పనులు చూడండి. మనుషుల విషయంలో ఆయన చేసిన కార్యాలు సంభ్రమాశ్చర్యాలు పుట్టిస్తాయి.+  6  ఆయన సముద్రాన్ని ఆరిన నేలగా మార్చాడు;+వాళ్లు కాలినడకన నదిని దాటారు.+ అక్కడ మనం ఆయన్ని బట్టి సంతోషించాం.+  7  ఆయన తన గొప్ప శక్తితో ఎప్పటికీ పరిపాలిస్తాడు.+ ఆయన కళ్లు దేశాల్ని గమనిస్తూ ఉంటాయి.+ మొండివాళ్లు తమను తాము హెచ్చించుకోకూడదు.+ (సెలా)  8  దేశదేశాల ప్రజలారా, మా దేవుణ్ణి స్తుతించండి,+ఆయన బిగ్గరగా స్తుతించబడాలి.  9  ఆయన మమ్మల్ని కాపాడి సజీవంగా ఉంచుతాడు;+మా పాదాలు తడబడనివ్వడు.+ 10  దేవా, నువ్వు మమ్మల్ని పరిశీలించావు;+వెండిని శుద్ధిచేసినట్టు మమ్మల్ని శుద్ధి చేశావు. 11  మేము వేటగాడి వలలో చిక్కుకునేలా చేశావు;అణచివేసే భారాన్ని మా* మీద పెట్టావు. 12  మనుషుల్ని మా* మీద స్వారీ చేయనిచ్చావు;మేము అగ్ని గుండా, నీళ్ల గుండా వచ్చాం;తర్వాత, సేదదీర్పునిచ్చే చోటుకు మమ్మల్ని రప్పించావు. 13  నేను సంపూర్ణ దహనబలులు తీసుకొని నీ మందిరంలోకి వస్తాను;నా మొక్కుబళ్లు నీకు చెల్లిస్తాను;+ 14  కష్టాల్లో ఉన్నప్పుడు నా పెదాలు మాటిచ్చిన,+నా నోటితో నేను మొక్కుకున్న మొక్కుబళ్లు నీకు చెల్లిస్తాను. 15  కొవ్విన జంతువుల్ని నీకు దహనబలులుగా అర్పిస్తాను,పొట్టేళ్ల బలి పొగ పైకిలేచేలా చేస్తాను. మేకపోతులతో పాటు ఎద్దుల్ని అర్పిస్తాను. (సెలా) 16  దేవునికి భయపడే ప్రజలారా, మీరంతా వచ్చి వినండి,ఆయన నా కోసం ఏమేం చేశాడో మీకు చెప్తాను. 17  నా నోటితో నేను ఆయనకు మొరపెట్టాను,నా నాలుకతో ఆయన్ని మహిమపర్చాను. 18  నేను నా హృదయంలో ఏదైనా చెడ్డదాని గురించి ఆలోచించివుంటే,యెహోవా నా ప్రార్థన వినేవాడు కాదు.+ 19  కానీ దేవుడు విన్నాడు;+ఆయన నా ప్రార్థన ఆలకించాడు.+ 20  నా ప్రార్థనను తిరస్కరించని,తన విశ్వసనీయ ప్రేమను నా మీద చూపించడం మానని దేవునికి స్తుతి కలగాలి.

అధస్సూచీలు

లేదా “సంగీతం వాయించండి.”
అక్ష., “మా తుంట్ల.”
అక్ష., “మా తల.”