కీర్తనలు 62:1-12

  • నిజమైన రక్షణ దేవుని నుండే వస్తుంది

    • “దేవుని కోసం నా ప్రాణం మౌనంగా ఎదురుచూస్తోంది” (1,5)

    • ‘దేవుని ముందు మీ హృదయాలు కుమ్మరించండి’ (8)

    • మనుషులు వట్టి ఊపిరి లాంటివాళ్లు (9)

    • సంపదను నమ్ముకోకండి (10)

సంగీత నిర్దేశకునికి సూచన; యెదూతూనుది.* దావీదు శ్రావ్యగీతం. 62  దేవుని కోసం నా ప్రాణం మౌనంగా ఎదురుచూస్తోంది. ఆయన నుండే నాకు రక్షణ వస్తుంది.+  2  ఆయనే నా ఆశ్రయదుర్గం,* నా రక్షణ, నా సురక్షితమైన ఆశ్రయం;*నేను ఎప్పటికీ అతిగా కదల్చబడను.+  3  ఒక మనిషిని చంపడానికి మీరు ఎంతకాలం అతని మీద దాడి చేస్తూ ఉంటారు? మీరందరూ ఒరిగిపోయిన గోడలా, కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న రాతిగోడలా ప్రమాదకరమైన వాళ్లు.*  4  ఉన్నత స్థానం నుండి అతన్ని పడేయాలని వాళ్లంతా కలిసి మాట్లాడుకుంటారు;అబద్ధాలాడడం వాళ్లకు చాలా ఇష్టం. వాళ్లు నోటితో దీవిస్తారు, లోపలేమో శపిస్తూ ఉంటారు.+ (సెలా)  5  దేవుని కోసం నా ప్రాణం మౌనంగా ఎదురుచూస్తోంది.+ఆయనే నా నిరీక్షణకు ఆధారం.+  6  ఆయనే నా ఆశ్రయదుర్గం,* నా రక్షణ, నా సురక్షితమైన ఆశ్రయం;నేను ఎప్పటికీ కదల్చబడను.+  7  నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారం. నా బలమైన ఆశ్రయదుర్గం,* నా ఆశ్రయం దేవుడే.+  8  ప్రజలారా, అన్ని సమయాల్లో ఆయన్ని నమ్ముకోండి. ఆయన ముందు మీ హృదయాలు కుమ్మరించండి.+ దేవుడే మనకు ఆశ్రయం. (సెలా)  9  మనుషులు వట్టి ఊపిరి లాంటివాళ్లు,వాళ్లంతా కేవలం మాయ. వాళ్లందర్నీ త్రాసులో ఉంచితే, వట్టి ఊపిరికన్నా తేలికగా ఉంటారు.+ 10  వంచనను నమ్ముకోకండి,దోచుకోవడం మీద లేనిపోని ఆశలు పెట్టుకోకండి. మీ సంపద విస్తరించినప్పుడు, దానిమీద మనసు పెట్టకండి.+ 11  దేవుడు ఒకసారి మాట్లాడాడు, నేను రెండుసార్లు ఈ మాట విన్నాను: బలం దేవునికే చెందుతుంది.+ 12  యెహోవా, విశ్వసనీయ ప్రేమ కూడా నీదే,+నువ్వు ప్రతీ ఒక్కరికి వాళ్లవాళ్ల పనుల్ని బట్టి ప్రతిఫలం ఇస్తావు.+

అధస్సూచీలు

పదకోశం చూడండి.
అక్ష., “బండరాయి.”
లేదా “ఎత్తైన స్థలం.”
లేదా “అతను ఒరిగిపోయిన గోడ, కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న రాతిగోడ అన్నట్టు మీరందరూ” అయ్యుంటుంది.
అక్ష., “బండరాయి.”
అక్ష., “బండరాయి.”