కీర్తనలు 87:1-7

  • సీయోను సత్యదేవుని నగరం

    • సీయోనులో పుట్టినవాళ్లు (4-6)

కోరహు కుమారుల కీర్తన.+ శ్రావ్యగీతం. గీతం. 87  ఆయన నగర పునాది పవిత్ర పర్వతాల్లో ఉంది.+   యాకోబు డేరాలన్నిటి కన్నాసీయోను ద్వారాలంటే యెహోవాకు చాలా ఇష్టం.+   సత్యదేవుని నగరమా, నీ గురించి గొప్పగొప్ప సంగతులు చెప్పుకుంటున్నారు.+ (సెలా)   రాహాబును,*+ బబులోనును నన్ను తెలుసుకున్న* వాటిగా పరిగణిస్తాను;ఫిలిష్తియ, తూరు, కూషులను చూడండి. వాటి ప్రజల్లో ప్రతీ ఒక్కరి గురించి నేను, “ఇతను అక్కడ పుట్టాడు” అని అంటాను.   సీయోను గురించి ప్రజలు, “ప్రతీ ఒక్కరు ఆ నగరంలో పుట్టారు” అని చెప్పుకుంటారు. సర్వోన్నతుడు ఆ నగరాన్ని బలంగా స్థాపిస్తాడు.   ప్రజల పేర్లు నమోదు చేస్తున్నప్పుడు, “ఇతను అక్కడ పుట్టాడు” అని యెహోవా ప్రకటిస్తాడు. (సెలా)   గాయకులు,+ నాట్యం* చేసేవాళ్లు,+ “నా ఊటలన్నీ నీలోనే ఉన్నాయి”*+ అని అంటారు.

అధస్సూచీలు

ఐగుప్తును సూచిస్తుండవచ్చు.
లేదా “గుర్తించిన.”
లేదా “గుండ్రంగా తిరుగుతూ నాట్యం.”
లేదా “నాకైతే, అన్నిటికీ మూలం నువ్వే.”