కీర్తనలు 75:1-10
-
దేవుడు న్యాయంగా తీర్పుతీరుస్తాడు
-
దుష్టులు యెహోవా గిన్నెలోది తాగుతారు (8)
-
సంగీత నిర్దేశకునికి సూచన. “నాశనం చేయకు” అనే రాగంలో పాడాలి. ఆసాపు+ కీర్తన. గీతం.
75 దేవా, మేము నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం;నువ్వు* మాకు దగ్గరగా ఉన్నావు.+ప్రజలు నీ అద్భుతమైన పనుల్ని ప్రకటిస్తారు.
2 నువ్వు ఇలా అంటున్నావు: “నేనొక సమయం నిర్ణయించిన తర్వాత,న్యాయంగా తీర్పు తీరుస్తాను.
3 భూమి, దాని నివాసులందరూ భయంతో కంపించినప్పుడు,దాని స్తంభాల్ని స్థిరంగా ఉంచింది నేనే.” (సెలా)
4 నేను గొప్పలు చెప్పుకునేవాళ్లతో, “గొప్పలు చెప్పుకోకండి” అంటాను.
దుష్టులతో ఇలా అంటాను: “మీ కొమ్మును* పైకి లేపకండి.
5 మీ కొమ్మును* అతిగా పైకి లేపకండి,అహంకారంతో మాట్లాడకండి.
6 ఎందుకంటే ఘనతతూర్పు నుండో, పడమర నుండో, దక్షిణం నుండో రాదు.
7 న్యాయమూర్తి దేవుడే.+
ఆయన ఒకర్ని తగ్గిస్తాడు, ఒకర్ని హెచ్చిస్తాడు.+
8 యెహోవా చేతిలో ఒక గిన్నె ఉంది;+మసాలాలు కలిపిన ద్రాక్షారసం నురగలు కక్కుతోంది.
ఆయన ఖచ్చితంగా దాన్ని కుమ్మరిస్తాడు,భూమ్మీది దుష్టులందరూ చివరిబొట్టు* వరకు దాన్ని తాగుతారు.”+
9 నేనైతే, దాని గురించి ఎప్పటికీ ప్రకటిస్తాను;యాకోబు దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడతాను.*
10 ఎందుకంటే ఆయన ఇలా అంటున్నాడు: “నేను దుష్టుల కొమ్ములన్నిటినీ* విరగ్గొడతాను,కానీ నీతిమంతుల కొమ్ములు* హెచ్చించబడతాయి.”

