కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

11వ ప్రశ్న

ఒక వ్యక్తి చనిపోయినప్పడు ఏం జరుగుతుంది?

“వాళ్ల ఊపిరి వెళ్లిపోతుంది, వాళ్లు తిరిగి మట్టికి చేరుకుంటారు; ఆ రోజే వాళ్ల ఆలోచనలు కూడా నశించిపోతాయి.”

కీర్తన 146:4

“బ్రతికున్నవాళ్లకు తాము చనిపోతామని తెలుసు, కానీ చనిపోయినవాళ్లకు ఏమీ తెలీదు . . . నువ్వు చేయగలిగిన ఏ పనైనా నీ పూర్తి శక్తితో చేయి, ఎందుకంటే నువ్వు వెళ్లే సమాధిలో పని గానీ, ఉపాయం గానీ, జ్ఞానం గానీ, తెలివి గానీ ఉండదు.”

ప్రసంగి 9:​5, 10

“యేసు ఇంకా ఇలా అన్నాడు: ‘మన స్నేహితుడు లాజరు నిద్రపోతున్నాడు, అతన్ని లేపడానికి వెళ్తున్నాను.’ నిజానికి యేసు లాజరు చనిపోయాడని చెప్తున్నాడు. కానీ వాళ్లేమో అతను నిద్రపోయి విశ్రాంతి తీసుకోవడం గురించి యేసు మాట్లాడుతున్నాడని అనుకున్నారు. అప్పుడు యేసు వాళ్లతో స్పష్టంగా ఇలా చెప్పాడు: ‘లాజరు చనిపోయాడు.’ ”

యోహాను 11:​11, 13, 14