కీర్తనలు 147:1-20

  • దేవుని ప్రేమగల, శక్తివంతమైన పనుల్ని స్తుతించడం

    • విరిగిన హృదయంగల వాళ్లను ఆయన బాగుచేస్తాడు (3)

    • నక్షత్రాలన్నిటినీ పేరు పెట్టి పిలుస్తున్నాడు (4)

    • ఆయన మంచును ఉన్నిలా పంపుతున్నాడు (16)

147  యెహోవాను* స్తుతించండి!* మన దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడడం* మంచిది;ఆయన్ని స్తుతించడం ఎంత మనోహరంగా ఉంటుంది! అదెంత సరైనది!+   యెహోవా యెరూషలేమును కడుతున్నాడు;+చెదిరిపోయిన ఇశ్రాయేలు ప్రజల్ని ​సమకూరుస్తున్నాడు.+   విరిగిన హృదయంగల వాళ్లను ఆయన బాగుచేస్తాడు;వాళ్ల గాయాలకు కట్టుకడతాడు.   నక్షత్రాల సంఖ్యను ఆయన లెక్కపెడుతున్నాడు;వాటన్నిటినీ పేరు పెట్టి పిలుస్తున్నాడు.+   మన ప్రభువు గొప్పవాడు, ఆయన చాలా శక్తిమంతుడు;+ఆయన అవగాహనకు పరిమితి లేదు.+   యెహోవా సాత్వికుల్ని పైకి లేపుతాడు,+అయితే దుష్టుల్ని నేల మీదికి ​విసిరేస్తాడు.   యెహోవాకు కృతజ్ఞతలు చెప్తూ పాటలు పాడండి;వీణతో* మన దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడండి.   ఆయన ఆకాశాన్ని మేఘాలతో ​కప్పుతున్నాడు,భూమికి వర్షాన్ని ఇస్తున్నాడు,+పర్వతాల మీద పచ్చిక మొలిచేలా చేస్తున్నాడు.+   జంతువులకు, ఆహారం కోసం మొరపెట్టే కాకి పిల్లలకుఆయన ఆహారం ఇస్తున్నాడు.+ 10  గుర్రాల శక్తిని చూసి ఆయన సంతో​షించడు;+మనుషుల బలమైన కాళ్లు ఆయన్ని ముగ్ధుణ్ణి చేయలేవు.+ 11  తనకు భయపడేవాళ్లను బట్టి,తన విశ్వసనీయ ప్రేమ కోసం వేచి​వుండే వాళ్లను+ బట్టి యెహోవా ​సంతోషిస్తాడు.+ 12  యెరూషలేమా, యెహోవాను ​మహిమపర్చు. సీయోనూ, నీ దేవుణ్ణి స్తుతించు. 13  ఆయన నీ నగర అడ్డగడియల్ని బల​పరుస్తున్నాడు;నీలో ఉన్న నీ ప్రజల్ని దీవిస్తున్నాడు. 14  ఆయన నీ ప్రాంతంలో శాంతిని స్థాపిస్తాడు;+శ్రేష్ఠమైన గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తాడు.+ 15  ఆయన భూమికి ఆజ్ఞ ఇస్తున్నాడు;ఆయన మాట త్వరగా పరుగెత్తుతోంది. 16  ఆయన మంచును ఉన్నిలా పంపుతున్నాడు;+మంచు కణాల్ని బూడిదలా చల్లుతున్నాడు.+ 17  వడగండ్లను రొట్టె ముక్కల్లా విసిరేస్తున్నాడు.+ ఆయన పుట్టించే చలిని ఎవరు తట్టుకో​గలరు?+ 18  ఆయన ఆజ్ఞాపించినప్పుడు అవి కరిగి​పోతాయి. ఆయన గాలిని వీచేలా చేసినప్పుడు+ నీళ్లు ప్రవహిస్తాయి. 19  ఆయన యాకోబుకు తన మాటను,ఇశ్రాయేలుకు తన నియమాల్ని, తీర్పుల్ని ప్రకటిస్తున్నాడు.+ 20  వేరే ఏ దేశ ప్రజల విషయంలో ఆయన అలా చేయలేదు;+ఆయన తీర్పుల గురించి వాళ్లకు ఏమీ తెలీదు. యెహోవాను* స్తుతించండి!*+

అధస్సూచీలు

అక్ష., “యా.” ఇది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.
లేదా “హల్లెలూయా!”
లేదా “సంగీతం వాయించడం.”
ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.
అక్ష., “యా.” ఇది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.
లేదా “హల్లెలూయా!”