కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

B1

బైబిల్లోని సందేశం

పరిపాలించే హక్కు యెహోవా దేవునికే ఉంది. ఆయన పరిపాలనా విధానమే అత్యుత్తమమైనది. భూమి విషయంలో, మనుషుల విషయంలో ఆయన సంకల్పం నెరవేరుతుంది.

సా.శ.పూ. 4026 తర్వాత

“సర్పం” యెహోవా పరిపాలనా హక్కును, ఆయన పరిపాలనా విధానాన్ని ప్రశ్నించింది. చివరికి ఆ సర్పాన్ని, అంటే సాతానును చితగ్గొట్టే ‘సంతానాన్ని’ లేదా ‘విత్తనాన్ని’ పుట్టిస్తానని యెహోవా మాటిచ్చాడు. (ఆదికాండం 3:1-5, 15, అధస్సూచి) అయితే, మనుషులు సాతాను ప్రభావం కింద తమను తాము పరిపాలించుకోవడానికి యెహోవా సమయం ఇచ్చాడు.

సా.శ.పూ. 1943

వాగ్దాన “సంతానం” అబ్రాహాము వంశం నుండి వస్తాడని యెహోవా అతనికి చెప్పాడు.—ఆదికాండం 22:18.

సా.శ.పూ. 1070 తర్వాత

వాగ్దాన ‘సంతానం’ వాళ్ల వంశంలో నుండే వస్తాడని యెహోవా దావీదు రాజుకు, ఆ తర్వాత అతని కుమారుడైన సొలొమోనుకు హామీ ఇచ్చాడు.—2 సమూయేలు 7:12, 16; 1 రాజులు 9:3-5; యెషయా 9:6, 7.

సా.శ. 29

దావీదు సింహాసనానికి వారసుడైన ఆ వాగ్దాన “సంతానం” యేసే అని యెహోవా తెలియజేశాడు.—గలతీయులు 3:16; లూకా 1:31-33; 3:21, 22.

సా.శ. 33

సర్పం, అంటే సాతాను యేసును చంపించడం ద్వారా వాగ్దాన ‘సంతానాన్ని’ తాత్కాలికంగా గాయపర్చాడు. యెహోవా యేసును పరలోకంలో జీవించేలా పునరుత్థానం చేసి, యేసు అర్పించిన పరిపూర్ణ ప్రాణం విలువను అంగీకరించాడు; అలా ఆదాము పిల్లల పాపాల్ని క్షమించడానికి, వాళ్లకు శాశ్వత జీవితం ఇవ్వడానికి మార్గం తెరుచుకుంది.—ఆదికాండం 3:15; అపొస్తలుల కార్యాలు 2:32-36; 1 కొరింథీయులు 15:21, 22.

దాదాపు సా.శ. 1914

యేసు ఆ సర్పాన్ని, అంటే సాతానును భూమ్మీద పడేసి కొంతకాలం అతన్ని భూమికే పరిమితం చేశాడు.—ప్రకటన 12:7-9, 12.

భవిష్యత్తులో

యేసు 1,000 ఏళ్లపాటు సాతానును బంధిస్తాడు; ఆ తర్వాత యేసు అతన్ని నాశనం చేస్తాడు, అలా అతని తలను చితగ్గొడతాడు. భూమి విషయంలో, మనుషుల విషయంలో యెహోవా సంకల్పం నెరవేరుతుంది; ఆయన పేరు మీద వేయబడిన నిందలన్నీ తొలగిపోతాయి; ఆయన పరిపాలనా విధానమే సరైనదని రుజువౌతుంది.—ప్రకటన 20:1-3, 10; 21:3, 4.