కంటెంట్‌కు వెళ్లు

యేసు మరణ జ్ఞాపకార్థ ఆచరణ

2024, మార్చి 24, ఆదివారం

సంవత్సరానికి ఒకసారి, యెహోవాసాక్షులు యేసుక్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణ జరుపుకుంటారు. ఎందుకంటే, యేసు ఇలా చెప్పాడు: “నన్ను గుర్తుచేసుకోవడానికి దీన్ని చేస్తూ ఉండండి.”—లూకా 22:19.

ఈ కార్యక్రమానికి రమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.

తరచూ అడిగే ప్రశ్నలు

ఎంతసేపు ఉంటుంది?

ఇది దాదాపు గంటసేపు ఉంటుంది.

ఎక్కడ జరుగుతుంది?

మీ ప్రాంతంలో ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవడానికి యెహోవాసాక్షుల్ని అడగండి.

హాజరవ్వడానికి డబ్బులేమైనా కట్టాలా?

లేదు.

చందాలు సేకరించబడతాయా?

లేదు. యెహోవాసాక్షులు తమ మీటింగ్స్‌లో చందాల్ని ఎప్పుడూ సేకరించరు.

ఫలానా విధంగానే బట్టలు వేసుకోవాలనే రూల్‌ ఏమైనా ఉందా?

ఈ కార్యక్రమానికి ఫలానా విధంగానే బట్టలు వేసుకోవాలనే రూల్‌ ఏమీ లేకపోయినా, యెహోవాసాక్షులు పద్ధతిగా, మర్యాదపూర్వకంగా ఉండే బట్టలు వేసుకోవాలనే బైబిలు సలహాను పాటించడానికి ప్రయత్నిస్తారు. (1 తిమోతి 2:9) బాగా ఖరీదైన బట్టలు వేసుకోవాల్సిన అవసరం లేదు.

జ్ఞాపకార్థ ఆచరణ ఎలా జరుగుతుంది?

ఈ ఆచరణ పాటతో, ఒక యెహోవాసాక్షి చేసే ప్రార్థనతో మొదలౌతుంది. అలాగే పాటతో, ప్రార్థనతో ముగుస్తుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమైన భాగం ఏంటంటే, ప్రసంగం. యేసు మరణం ఎంత ప్రాముఖ్యమైనదో, దేవుడు అలాగే యేసు మనకోసం చేసిన దాన్నుండి మనం ఎలా ప్రయోజనం పొందవచ్చో ఆ ప్రసంగంలో చెప్తారు.