కంటెంట్‌కు వెళ్లు

యెహోవాసాక్షుల సంఘ కూటాలు

మా కూటాల గురించి తెలుసుకోండి. మీకు దగ్గర్లో కూటం ఎక్కడ జరుగుతుందో తెలుసుకోండి.

మీకు దగ్గర్లో ఉన్న ప్రాంతాన్ని కనుక్కోండి (కొత్త విండో ఓపెన్‌ అవుతుంది)

మా కూటాలు ఎలా జరుగుతాయి?

యెహోవాసాక్షులు ఆరాధన కోసం వారానికి రెండుసార్లు కూటాలు జరుపుకుంటారు. (హెబ్రీయులు 10:24, 25) ఈ కూటాలకు అందరూ హాజరవ్వవచ్చు. అక్కడ మేము బైబిలు ఏమి చెబుతుందో పరిశీలిస్తాం, అందులోని బోధలను మా జీవితాల్లో ఎలా పాటించాలో తెలుసుకుంటాం.

మా కూటాలు చాలావరకు పాఠశాల తరగతుల్లో జరిగినట్లు ప్రేక్షకులతో చర్చా రూపంలో జరుగుతాయి. అందరూ ఆ చర్చలో స్వచ్ఛందంగా పాల్గొనవచ్చు. కూటాలు పాట, ప్రార్థనతో మొదలై పాట, ప్రార్థనతో ముగుస్తాయి.

మా కూటాలకు హాజరవడానికి మీరు యెహోవాసాక్షులే అయ్యుండాల్సిన అవసరం లేదు. మేము ప్రతీ ఒక్కర్నీ ఆహ్వానిస్తాం. ప్రవేశం పూర్తిగా ఉచితం, చందాలు ఎప్పుడూ సేకరించబడవు.