కంటెంట్‌కు వెళ్లు

విశ్వాసం వల్ల శక్తిమంతులవ్వండి!

2021 యెహోవాసాక్షుల సమావేశం

యెహోవాసాక్షులు ఈ సంవత్సరం ఏర్పాటు చేసిన మూడు రోజుల సమావేశానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. కోవిడ్‌-19 మహమ్మారి వల్ల ఈ సంవత్సరం జరిగే సమావేశ కార్యక్రమం jw.org వెబ్‌సైట్‌లో చూపించబడుతుంది. జూలై, ఆగస్టు నెలల్లో ఈ కార్యక్రమం వెబ్‌సైట్‌లో భాగాలుగా విడుదల చేయబడుతుంది.

ముఖ్యాంశాలు

  • శుక్రవారం కార్యక్రమం: దేవుడు ఉన్నాడనే విషయం మీద, ఆయన వాక్యం మీద, ఆయన ఉంచిన నైతిక ప్రమాణాల మీద, ఆయన చూపించిన ప్రేమ మీద విశ్వాసం పెంచుకోవడానికి ఎలాంటి మంచి కారణాలు ఉన్నాయో తెలుసుకోండి. ప్రకృతిలో ఉన్న కొన్ని అద్భుతమైన విషయాల్ని పరిశీలించండి. ఆ విధంగా సృష్టికర్త చెప్పినవన్నీ నిజమౌతాయనే మీ విశ్వాసం బలపడవచ్చు.

  • శనివారం కార్యక్రమం: యెహోవాసాక్షులు ఎందుకు ప్రకటిస్తూ ఉంటారు? వాళ్లు చెప్పే సందేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఎలా సహాయం చేస్తుందో తెలుసుకోండి.

  • ఆదివారం కార్యక్రమం: “మంచివార్త” అంటే ఏంటి? (మార్కు 1:14, 15) దాన్ని మనం నమ్మవచ్చా? “మంచివార్త మీద విశ్వాసం ఉంచండి” అనే బైబిలు ఆధారిత ప్రసంగంలో ఆ ప్రశ్నలకు జవాబులు వినండి.

  • బైబిలు డ్రామా: దానియేలు ప్రవక్త గురించిన చరిత్ర చాలా ఆసక్తిగా ఉంటుంది. శనివారం ఆదివారం కార్యక్రమాల్లో, ఆయన జీవితం మీద తీసిన డ్రామాను రెండు భాగాలుగా చూపిస్తారు. ఎగతాళి, శోధనలు, కష్టాలు ఎదురైనప్పుడు ఆయనెలా వాటిని తట్టుకున్నాడో ఆ డ్రామాలో చూడండి.

కార్యక్రమం ఉచితం

లాగిన్‌ లేదా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు

పూర్తి సమావేశ కార్యక్రమం గురించి తెలుసుకోండి, అలాగే మా సమావేశాలకు సంబంధించిన వీడియో చూడండి.