కావలికోట లైబ్రరీలో బైబిళ్లు, యెహోవాసాక్షుల ప్రచురణలు ఉంటాయి. ఇందులో ఇన్‌సైట్‌ ఆన్‌ ద స్క్రిప్చర్స్‌ అనే బైబిలు ఎన్‌సైక్లోపీడియా, పుస్తకాలు, బ్రోషుర్లు, కరపత్రాలు, పత్రికలు ఉంటాయి. పరిశోధన చేయడానికి ఉపయోగపడే వాచ్‌టవర్‌ పబ్లికేషన్స్‌ ఇండెక్స్‌, యెహోవాసాక్షుల పరిశోధనా పుస్తకం వంటి కొన్ని సహాయకాలు కూడా ఉంటాయి. ఏదైనా పదాన్ని, పదబంధాన్ని లేదా లేఖనాన్ని మీరు ఈ ప్రచురణల్లో వేటిలోనైనా వెదకవచ్చు.

ఈ ఫైల్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దీని సైజు దాదాపు 2 GB ఉంటుంది. మీ ఇంటర్నెట్‌ బాండ్‌విడ్త్‌ సరిపోకపోతే లేదా ఖర్చు ఎక్కువౌతుందనుకుంటే, దగ్గర్లో ఉన్న యెహోవాసాక్షుల సంఘం నుండి ఒక ఇన్‌స్టాలేషన్‌ డీవీడీ అడిగి తీసుకోవచ్చు. కావలికోట లైబ్రరీ మీ భాషలో ఉందో లేదో తెలుసుకోవడానికి డౌన్‌లోడ్‌ బటన్‌ క్లిక్‌ చేయండి.