మా సంస్కృతులు, భాషలు వేరు. అయినా మేమంతా కలిసికట్టుగా ఉంటాం, మాకున్న లక్ష్యాలు ఒక్కటే. యెహోవా దేవుణ్ణి ఘనపర్చడమే మా ముఖ్యోద్దేశం, యెహోవా దేవుడని బైబిలు చెబుతోంది. ఆయనే అన్నిటినీ సృష్టించాడు. యేసు క్రీస్తును ఆదర్శంగా తీసుకోవడానికి మా శాయశక్తులా కృషిచేస్తాం. క్రైస్తవులమని చెప్పుకోవడానికి గర్విస్తున్నాం. బైబిలు గురించి, దేవుని రాజ్యం గురించి ఇతరులకు నేర్పించడానికి సాధారణంగా మాలో ప్రతి ఒక్కరం సమయం వెచ్చిస్తాం. యెహోవా దేవుని గురించి, ఆయన రాజ్యం గురించి సాక్ష్యమిస్తాం, మాట్లాడతాం. అందుకే మాకు యెహోవాసాక్షులు అనే పేరు ఉంది.

మా సైట్‌లో సంచారం చేయండి. మా గురించి, మా నమ్మకాల గురించి ఇంకెక్కువ తెలుసుకోండి.