కంటెంట్‌కు వెళ్లు

యెహోవాసాక్షుల సంఘాలు ఎలా వ్యవస్థీకరించబడ్డాయి?

యెహోవాసాక్షుల సంఘాలు ఎలా వ్యవస్థీకరించబడ్డాయి?

 ప్రతీ సంఘాన్ని పెద్దల సభ పర్యవేక్షిస్తుంది. దాదాపు 20 సంఘాలు కలిపి ఒక సర్క్యూట్‌గా, దాదాపు 10 సర్క్యూట్‌లు కలిపి ఒక జిల్లాగా విభజిస్తారు. ప్రయాణ పర్యవేక్షకులు, జిల్లా పర్యవేక్షకులు అనే ప్రయాణ పెద్దలు సంఘాలను క్రమంగా సందర్శిస్తుంటారు.

 ఎన్నో ఏళ్ల నుండి సాక్షులుగా ఉన్న సభ్యులతో ఏర్పడిన పరిపాలక సభ బైబిలు ఆధారిత నిర్దేశాలను, ఉపదేశాలను ఇస్తుంది. బ్రూక్లిన్‌, న్యూయార్క్‌లో ఉన్న యెహోవాసాక్షుల ప్రపంచ కార్యాలయాల్లో ఈ పరిపాలక సభ పనిచేస్తుంది.—అపొస్తలుల కార్యములు 15:23-29; 1 తిమోతి 3:1-7.