మొదటి తిమోతి 2:1-15

  • అన్నిరకాల ప్రజల కోసం ప్రార్థన (1-7)

    • దేవుడు ఒక్కడే, మధ్యవర్తి ఒక్కడే (5)

    • అందరి కోసం సరిసమానమైన విమోచన క్రయధనం (6)

  • పురుషులకు, స్త్రీలకు నిర్దేశాలు (8-15)

    • అణకువ ఉట్టిపడేలా బట్టలు వేసుకోండి (9, 10)

2  కాబట్టి ముందుగా నేను వేడుకునేదేమిటంటే, మనం అన్నిరకాల ప్రజల కోసం అభ్యర్థనలు, ప్రార్థనలు, విన్నపాలు చేయాలి, కృతజ్ఞతలు చెల్లించాలి.  రాజుల కోసం, ఉన్నత స్థానాల్లో* ఉన్నవాళ్లందరి కోసం కూడా అలా చేయాలి.+ అప్పుడు మనం అన్ని విషయాల్లో దైవభక్తిని, పట్టుదలను చూపిస్తూ నెమ్మది కలిగి, ప్రశాంతంగా జీవించగలుగుతాం.+  ఇది మన రక్షకుడైన దేవుని దృష్టికి మంచిది, అంగీకారమైనది.  ఆయన అన్నిరకాల ప్రజలు సత్యం గురించిన సరైన జ్ఞానాన్ని సంపాదించుకొని రక్షించబడాలని కోరుకుంటున్నాడు.*+  దేవుడు ఒక్కడే,+ దేవునికీ మనుషులకూ+ మధ్యవర్తి+ ఒక్కడే, ఆయన క్రీస్తుయేసు+ అనే మనిషి.  ఆయన అందరి* కోసం సరిసమానమైన విమోచన క్రయధనంగా* తనను తాను అర్పించుకున్నాడు.+ దాని గురించిన సాక్ష్యం తగిన సమయంలో ఇవ్వబడుతుంది.  దాని గురించి సాక్ష్యమివ్వడానికే+ నేను ప్రచారకుడిగా, అపొస్తలుడిగా,+ అలాగే విశ్వాసం, సత్యం విషయంలో అన్యజనులకు బోధకుడిగా+ నియమించబడ్డాను. నేను నిజమే చెప్తున్నాను, అబద్ధం చెప్పట్లేదు.  కాబట్టి మీరు సమావేశమయ్యే ప్రతీచోట, పురుషులు కోపానికి గానీ+ వాదులాటలకు గానీ చోటివ్వకుండా,+ పవిత్రమైన* చేతులెత్తి ప్రార్థిస్తూ ఉండాలని+ కోరుకుంటున్నాను.  అలాగే స్త్రీలు రకరకాల జడలతో, బంగారంతో, ముత్యాలతో, ఖరీదైన బట్టలతో కాకుండా, అణకువ, మంచి వివేచన ఉట్టిపడే గౌరవప్రదమైన* బట్టలతో తమను తాము అలంకరించుకోవాలి.+ 10  దైవభక్తిగల స్త్రీలకు తగినట్టు మంచిపనులు చేయాలి, అదే వాళ్లకు అలంకారం.+ 11  స్త్రీలు మౌనంగా* ఉంటూ పూర్తి విధేయతతో+ నేర్చుకోవాలి. 12  బోధించడానికి గానీ పురుషుని మీద అధికారం చెలాయించడానికి గానీ స్త్రీకి నేను అనుమతి ఇవ్వను; ఆమె మౌనంగా* ఉండాలి.+ 13  ఎందుకంటే ముందు ఆదాము సృష్టించబడ్డాడు, ఆ తర్వాతే హవ్వ సృష్టించబడింది.+ 14  అంతేకాదు, ఆదాము మోసపోలేదు కానీ స్త్రీయే పూర్తిగా మోసపోయి,+ అపరాధి అయింది. 15  ఏదేమైనా, స్త్రీ మంచి వివేచన చూపిస్తూ+ విశ్వాసంతో, ప్రేమతో, పవిత్రతతో నడుచుకుంటూ ఉంటే, పిల్లల్ని కనడం ద్వారా ఆమె* సురక్షితంగా ఉంటుంది.+

అధస్సూచీలు

లేదా “అధికార స్థానాల్లో.”
లేదా “రక్షించబడాలనేది ఆయన ఇష్టం.”
లేదా “అన్నిరకాల ప్రజల.”
పదకోశం చూడండి.
అక్ష., “విశ్వసనీయమైన.”
లేదా “తగిన.”
లేదా “నిశ్శబ్దంగా; ప్రశాంతంగా.”
లేదా “నిశ్శబ్దంగా; ప్రశాంతంగా.”
అక్ష., “వాళ్లు.”