కీర్తనలు 124:1-8
యాత్ర కీర్తన. దావీదుది.
124 “యెహోవా మనతో పాటు లేకపోయుంటే,”+
అప్పుడు ఇశ్రాయేలు ఇలా అనాలి:
2 “యెహోవా మనతో పాటు లేకపోయుంటే,+మనుషులు మన మీద దాడి చేయడానికి లేచినప్పుడు,+
3 వాళ్ల కోపాగ్ని మనమీద రగులుకున్నప్పుడు+వాళ్లు మనల్ని ప్రాణాలతోనే మింగేసేవాళ్లు.+
4 అప్పుడు నీళ్లు మనల్ని కొట్టుకొనిపోయేవి,నీటిప్రవాహం మన మీద పొంగిపొర్లేది.+
5 ఉప్పొంగే నీళ్లు మనల్ని ముంచేసేవి.
6 యెహోవా స్తుతించబడాలి,ఆయన మనల్ని వాళ్లకు ఎరగా అప్పగించలేదు.
7 మనం వేటగాడి ఉచ్చు నుండితప్పించుకున్న పక్షిలా ఉన్నాం;+ఉచ్చు తెగిపోయింది,మనం పారిపోయాం.+
8 భూమ్యాకాశాల్ని చేసిన, యెహోవా అనే పేరున్నదేవుని నుండే మనకు సహాయం దొరుకుతుంది.”+