కీర్తనలు 26:1-12

  • యథార్థంగా నడవడం

    • “యెహోవా, నన్ను పరిశీలించు” (2)

    • చెడు సహవాసానికి దూరంగా ఉండడం (4, 5)

    • ‘నేను దేవుని బలిపీఠం చుట్టూ తిరుగుతాను’ (6)

దావీదు కీర్తన. 26  యెహోవా, నేను యథార్థంగా నడుచుకున్నాను, నాకు తీర్పు తీర్చు.+నేను యెహోవా మీద నమ్మకముంచాను, నేను ఊగిసలాడలేదు.+   యెహోవా, నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు;నా అంతరంగాన్ని,* హృదయాన్ని శుద్ధి చేయి.+   ఎందుకంటే, నీ విశ్వసనీయ ప్రేమ ఎప్పుడూ నా ఎదుట ఉంది,నేను నీ సత్యంలో నడుస్తున్నాను.+   మోసగాళ్లతో నేను సహవసించను,*+తమ నిజ స్వరూపాన్ని దాచిపెట్టేవాళ్లకు నేను దూరంగా ఉంటాను.*   చెడ్డవాళ్ల గుంపు అంటే నాకు అసహ్యం,+దుష్టులతో సహవసించడానికి* నేను ఒప్పుకోను.+   యెహోవా, నేను నిర్దోషిగా నా చేతులు కడుక్కుంటాను,నేను నీ బలిపీఠం చుట్టూ తిరుగుతాను.   నీకు బిగ్గరగా కృతజ్ఞతలు తెలపడానికి,+నీ అద్భుతమైన పనులన్నిటి గురించి ప్రకటించడానికి అలా చేస్తాను.   యెహోవా, నువ్వు నివసించే మందిరాన్ని,+నీ మహిమ నివసించే స్థలాన్ని నేను ప్రేమిస్తాను.+   పాపులతో పాటు నన్ను తుడిచేయకు,+దౌర్జన్యం చేసేవాళ్లతో* పాటు నా ప్రాణం తీసేయకు, 10  వాళ్లు* అవమానకరమైన పనులు చేస్తున్నారు,వాళ్ల కుడిచెయ్యి లంచాలతో నిండిపోయింది. 11  నేనైతే, యథార్థంగా నడుచుకుంటాను. నన్ను రక్షించి,* నా మీద అనుగ్రహం చూపించు. 12  నా పాదాలు సమతలమైన నేల మీద నిలబడి ఉన్నాయి;+మహా సమాజంలో నేను యెహోవాను స్తుతిస్తాను.+

అధస్సూచీలు

లేదా “లోతైన భావోద్వేగాల్ని.” అక్ష., “మూత్రపిండాల్ని.”
అక్ష., “కూర్చోను.”
లేదా “నేను వేషధారులతో కలవను.”
అక్ష., “కూర్చోవడానికి.”
లేదా “రక్తం చిందించేవాళ్లతో.”
అక్ష., “వాళ్ల చేతులు.”
అక్ష., “విడిపించి.”