కీర్తనలు 136:1-26

  • యెహోవా విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది

    • ఆకాశాన్ని, భూమిని నైపుణ్యంతో చేశాడు (5, 6)

    • ఫరో ఎర్రసముద్రంలో చనిపోయాడు (15)

    • దీనస్థితిలో ఉన్నవాళ్లను దేవుడు గుర్తుచేసుకుంటాడు (23)

    • ప్రతీ ప్రాణికి ఆహారం (25)

136  యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి, ఆయన మంచివాడు;+ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది.+   దేవాది దేవుడికి+ కృతజ్ఞతలు చెప్పండి,ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది.   ప్రభువుల ప్రభువుకు కృతజ్ఞతలు చెప్పండి,ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది.   ఆయన మాత్రమే గొప్పగొప్ప అద్భుతాలు చేస్తాడు,+ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది.+   ఆయన నైపుణ్యంతో* ఆకాశాన్ని చేశాడు,+ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది.   ఆయన జలాల పైన భూమిని పరిచాడు,+ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది.   ఆయన గొప్ప జ్యోతుల్ని చేశాడు,+ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది,   పగటిని ఏలడానికి సూర్యుణ్ణి చేశాడు,+ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది,   రాత్రిని ఏలడానికి చంద్రుణ్ణి, నక్షత్రాల్ని చేశాడు,+ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. 10  ఆయన ఐగుప్తులోని మొదటి సంతానాన్ని చంపేశాడు,+ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. 11  వాళ్ల మధ్య నుండి ఇశ్రాయేలీయుల్ని బయటికి తీసుకొచ్చాడు,+ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది, 12  తన బలమైన చేతితో,+ చాచిన బాహువుతో వాళ్లను తీసుకొచ్చాడు,ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. 13  ఆయన ఎర్రసముద్రాన్ని రెండుగా* చీల్చాడు,+ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. 14  ఇశ్రాయేలీయుల్ని దాని మధ్య నుండి వెళ్లేలా చేశాడు,+ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. 15  ఫరోను, అతని సైన్యాన్ని ఎర్రసముద్రంలో ముంచేశాడు,+ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. 16  తన ప్రజల్ని ఎడారి గుండా నడిపించాడు,+ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. 17  ఆయన గొప్పగొప్ప రాజుల్ని నాశనం చేశాడు,+ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. 18  బలమైన రాజుల్ని చంపేశాడు,ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది, 19  అమోరీయుల రాజైన సీహోనును+ చంపాడు,ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది, 20  బాషాను రాజైన ఓగును+ చంపాడు,ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. 21  వాళ్ల దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు,+ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది, 22  తన సేవకుడైన ఇశ్రాయేలుకు దాన్ని వారసత్వ ఆస్తిగా ఇచ్చాడు,ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. 23  మనం దీనస్థితిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని గుర్తుచేసుకున్నాడు,+ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది.+ 24  మన శత్రువుల నుండి మనల్ని కాపాడుతూ వచ్చాడు,+ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. 25  ఆయన ప్రతీ ప్రాణికి ఆహారం ఇస్తున్నాడు,+ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. 26  పరలోక దేవుడికి కృతజ్ఞతలు చెప్పండి,ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది.

అధస్సూచీలు

లేదా “అవగాహనతో.”
లేదా “పాయలుగా.”