కీర్తనలు 137:1-9

  • బబులోను నదుల పక్కన

    • సీయోను పాటల్లో దేన్నీ పాడలేదు (3, 4)

    • బబులోను నాశనమౌతుంది (8)

137  మనం బబులోను నదుల పక్కన+ కూర్చుని ఉన్నప్పుడు, సీయోనును గుర్తుచేసుకుంటూ ఏడ్చాం.+  2  దాని* మధ్య ఉన్న నిరవంజి చెట్లకుమన వీణలు* తగిలించాం.+  3  మనల్ని చెరపట్టినవాళ్లు అక్కడ మనల్ని ఒక పాట పాడమని అడిగారు,+మనల్ని ఎగతాళి చేసేవాళ్లు వినోదం కోరుకుంటూ, “మాకోసం సీయోను పాటల్లో ఒక పాట పాడండి” అన్నారు.  4  పరాయి నేల మీదమనం యెహోవా పాటను ఎలా పాడగలం?  5  యెరూషలేమా, నేను నిన్ను మర్చిపోతేనా కుడిచెయ్యి తన నైపుణ్యాన్ని మర్చిపోవాలి.*+  6  నేను నిన్ను గుర్తుచేసుకోకపోతే,నాకు అత్యంత సంతోషాన్నిచ్చే వాటన్నిటికన్నాయెరూషలేమును పైస్థానంలో ఉంచకపోతే,+నా నాలుక నా అంగిలికి అంటుకుపోవాలి.  7  యెహోవా, యెరూషలేము పడిపోయిన రోజునఎదోమీయులు అన్న మాటల్ని గుర్తుచేసుకో. వాళ్లు, “దాన్ని కూలగొట్టండి! పునాదుల వరకు దాన్ని కూలగొట్టండి!” అన్నారు.+  8  త్వరలోనే నాశనం కాబోతున్న బబులోను కుమారీ,+నువ్వు మాకు చేసినదాన్ని బట్టినీకు ప్రతీకారం చేసేవాళ్లు+ ధన్యులు.*  9  నీ పిల్లల్ని పట్టుకొనిబండకేసి కొట్టేవాళ్లు+ ధన్యులు.

అధస్సూచీలు

బబులోనును సూచిస్తుంది.
ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.
లేదా “ఎండిపోవాలి” అయ్యుంటుంది.
లేదా “సంతోషంగా ఉంటారు.”