కీర్తనలు 78:1-72

  • దేవుని శ్రద్ధ, ఇశ్రాయేలుకు విశ్వాసం లేకపోవడం

    • రాబోయే తరానికి చెప్పడం (2-8)

    • “వాళ్లు దేవుని మీద విశ్వాసం ఉంచలేదు” (22)

    • “ఆకాశ ధాన్యం” (24)

    • “ఇశ్రాయేలు పవిత్ర దేవుణ్ణి దుఃఖపెట్టారు” (41)

    • ఐగుప్తు నుండి వాగ్దాన దేశానికి (43-55)

    • ‘వాళ్లు దేవుణ్ణి పరీక్షిస్తూ వచ్చారు’ (56)

మాస్కిల్‌.* ఆసాపు+ కీర్తన. 78  నా ప్రజలారా, నా ఉపదేశం* వినండి;నా నోటి మాటలు ఆలకించండి.  2  నేను నోరు తెరిచి సామెత చెప్తాను. చాలాకాలం కిందటి పొడుపు కథలు చెప్తాను.+  3  మేము విన్న, మాకు తెలిసిన,మా తండ్రులు మాకు చెప్పిన సంగతుల్ని+  4  మేము వాళ్ల సంతానానికి చెప్పకుండా ఉండం;యెహోవా స్తుతిపాత్రమైన కార్యాల్ని, ఆయన బలాన్ని,ఆయన చేసిన అద్భుతమైన కార్యాల్ని+రాబోయే తరానికి చెప్తాం.+  5  ఆయన యాకోబులో ఒక జ్ఞాపికను పెట్టాడు,ఇశ్రాయేలులో ధర్మశాస్త్రాన్ని నియమించాడు;ఈ విషయాల్ని తమ పిల్లలకు తెలియజేయమనిమన పూర్వీకులకు ఆజ్ఞాపించాడు.+  6  అప్పుడు తర్వాతి తరంవాళ్లు,పుట్టబోయేవాళ్లు వాటిని తెలుసుకుంటారు.+ వాళ్లు వాళ్ల పిల్లలకు వాటిని చెప్తారు.+  7  దానివల్ల వాళ్లు దేవుని మీద నమ్మకం ఉంచుతారు. దేవుని కార్యాల్ని మర్చిపోకుండా ఉంటారు,+ఆయన ఆజ్ఞల్ని పాటిస్తారు.+  8  అప్పుడు వాళ్లు తమ పూర్వీకుల్లా తయారవ్వకుండా ఉంటారు.వాళ్ల పూర్వీకులు మొండివాళ్లు, తిరుగుబాటుదారులు,+వాళ్ల హృదయానికి నిలకడలేదు,*+వాళ్లు దేవునికి నమ్మకంగా లేరు.  9  ఎఫ్రాయిమీయులు విల్లును ధరించారు,కానీ వాళ్లు యుద్ధ భూమి నుండి పారిపోయారు. 10  వాళ్లు దేవుని ఒప్పందానికి కట్టుబడి ఉండలేదు,+ఆయన ధర్మశాస్త్రానికి లోబడలేదు.+ 11  అంతేకాదు వాళ్లు దేవుని కార్యాల్ని,ఆయన వాళ్లకు చూపించిన ఆశ్చర్యకార్యాల్ని* మర్చిపోయారు.+ 12  ఆయన ఐగుప్తు దేశంలో, సోయను+ ప్రాంతంలోవాళ్ల పూర్వీకుల కళ్లముందు ఆశ్చర్యకార్యాలు చేశాడు.+ 13  వాళ్లు నడిచివెళ్లేలా సముద్రాన్ని పాయలు చేశాడు,నీళ్లను ఆనకట్టలా* నిలబెట్టాడు.+ 14  పగలు మేఘంతో,రాత్రంతా అగ్ని వెలుగుతో వాళ్లను నడిపించాడు.+ 15  ఎడారిలో బండల్ని చీల్చివాళ్లు తృప్తిగా తాగేలా సముద్రమంత సమృద్ధిగా నీళ్లు ఇచ్చాడు.+ 16  బండ నుండి ప్రవాహాల్ని రప్పించినీళ్లు నదుల్లా పారేటట్టు చేశాడు.+ 17  కానీ వాళ్లు ఎడారిలో సర్వోన్నతుని మీద తిరుగుబాటుచేసి+ఆయనకు వ్యతిరేకంగా పాపం చేస్తూ వచ్చారు; 18  తాము ఎంతగానో కోరుకున్న ఆహారం కోసం పట్టుబడుతూ,తమ హృదయాల్లో దేవుణ్ణి పరీక్షించారు.*+ 19  “దేవుడు మాకోసం ఈ ఎడారిలో భోజనం పెట్టగలడా?”*అంటూ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు.+ 20  ఇదిగో! నీళ్లు పారేలా, వాగులు ప్రవహించేలాబండను కొట్టింది ఆయనే.+ అయినా వాళ్లు, “ఆయన మనకు రొట్టెను ఇవ్వగలడా?తన ప్రజల కోసం మాంసాన్ని ఇవ్వగలడా?” అన్నారు.+ 21  వాళ్ల మాటలు విన్నప్పుడు యెహోవాకు చాలా కోపం వచ్చింది;+యాకోబు మీద అగ్ని+ రగులుకుంది,ఇశ్రాయేలు మీద ఆయన కోపం మండింది.+ 22  ఎందుకంటే వాళ్లు దేవుని మీద విశ్వాసం ఉంచలేదు;+ఆయన రక్షణ సామర్థ్యం మీద నమ్మకం ఉంచలేదు. 23  కాబట్టి ఆయన, పైనున్న ఆకాశ మేఘాలకు ఆజ్ఞ ఇచ్చి,ఆకాశ తలుపులు తెరిచాడు. 24  వాళ్లు తినడానికి మన్నా కురిపిస్తూ వచ్చాడు;ఆకాశ ధాన్యం వాళ్లకు ఇచ్చాడు.+ 25  మనుషులు బలశాలుల*+ ఆహారం తిన్నారు;వాళ్లు తృప్తిగా తినేంత ఇచ్చాడు.+ 26  ఆయన ఆకాశంలో తూర్పు గాలిని రేపాడుతన శక్తితో దక్షిణ గాలి వీచేలా చేశాడు.+ 27  ఆయన ధూళి అంత విస్తారంగా మాంసాన్ని,సముద్ర తీరంలోని ఇసుక రేణువులంత విస్తారంగా పక్షుల్ని వాళ్లమీద కురిపించాడు. 28  అవి తన పాలెం మధ్యలో,తన డేరాల చుట్టూ పడేలా చేశాడు. 29  వాళ్లు పీకల దాకా తిన్నారు.వాళ్లు కోరుకున్నది ఆయన వాళ్లకిచ్చాడు.+ 30  అయితే వాళ్ల కక్కుర్తి తీరకముందే,ఆహారం ఇంకా వాళ్ల నోట్లో ఉండగానే, 31  దేవుని కోపం వాళ్ల మీద రగులుకుంది.+ వాళ్లలోని అత్యంత బలిష్ఠుల్ని ఆయన చంపేశాడు;+ఇశ్రాయేలులోని యువకులు నేలకొరిగేలా చేశాడు. 32  ఇంత జరిగినా, వాళ్లు ఇంకా ఎక్కువగా పాపం చేస్తూ వచ్చారు,+ఆయన ఆశ్చర్యకార్యాల*+ మీద విశ్వాసం ఉంచలేదు. 33  దాంతో ఆయన, ఊపిరిలా వాళ్ల రోజుల్ని,ఆకస్మిక విపత్తులతో వాళ్ల సంవత్సరాల్ని ముగించాడు.+ 34  కానీ ఆయన వాళ్లను చంపినప్పుడల్లా వాళ్లు ఆయన్ని వెదికేవాళ్లు;+వాళ్లు తిరిగొచ్చి దేవుని కోసం చూసేవాళ్లు. 35  దేవుడే తమ ఆశ్రయదుర్గం*+ అని,సర్వోన్నతుడైన దేవుడే తమ విమోచకుడు*+ అని గుర్తుచేసుకునేవాళ్లు. 36  కానీ వాళ్లు తమ నోటితో ఆయన్ని మోసం చేయడానికి ప్రయత్నించారు,తమ నాలుకతో ఆయన ముందు అబద్ధాలాడారు. 37  వాళ్ల హృదయాలు ఆయన పట్ల నిలకడగా లేవు;+ఆయన ఒప్పందానికి వాళ్లు నమ్మకంగా లేరు.+ 38  కానీ ఆయన కరుణ గలవాడు;+వాళ్ల తప్పుల్ని క్షమించేవాడు,* వాళ్లను నాశనం చేసేవాడు కాదు.+ తన ఉగ్రత అంతటినీ రేపుకునే బదులుచాలాసార్లు తన కోపాన్ని అణుచుకున్నాడు.+ 39  ఎందుకంటే, వాళ్లు కేవలం మనుషులని,వీచిన తర్వాత తిరిగిరాని గాలిలాంటి వాళ్లని* ఆయన గుర్తుచేసుకున్నాడు.+ 40  ఎడారిలో వాళ్లు ఎన్నోసార్లు ఆయన మీద తిరుగుబాటు చేశారు!+ఎడారిలో ఎన్నోసార్లు ఆయన్ని బాధపెట్టారు!+ 41  పదేపదే దేవుణ్ణి పరీక్షించారు,+ఇశ్రాయేలు పవిత్ర దేవుణ్ణి దుఃఖపెట్టారు.* 42  వాళ్లు ఆయన శక్తిని* గానీ,శత్రువు నుండి ఆయన తమను కాపాడిన* రోజును+ గానీ గుర్తు చేసుకోలేదు. 43  ఐగుప్తులో ఆయన ఎలాంటి సూచనలు చూపించాడో,+సోయను ప్రాంతంలో ఎలాంటి అద్భుతాలు చేశాడో, 44  వాళ్లు నైలు కాలువల నీళ్లను తాగలేకపోయేలావాటిని ఎలా రక్తంగా మార్చాడో+ వాళ్లు గుర్తుచేసుకోలేదు. 45  వాళ్లను మింగేయడానికి జోరీగల గుంపుల్ని,+వాళ్లను నాశనం చేయడానికి కప్పల్ని ఆయన పంపించాడు.+ 46  వాళ్ల పంటల్ని తిండిబోతు మిడతలకు,వాళ్ల కష్టఫలాన్ని మిడతల దండుకు అప్పగించాడు.+ 47  వడగండ్ల వానతో వాళ్ల ద్రాక్షతీగల్ని,వడగండ్లతో వాళ్ల అత్తి చెట్లను నాశనం చేశాడు.+ 48  వాళ్ల పశువుల మీద వడగండ్ల వానను,వాళ్ల మందల మీద పిడుగుల్ని కురిపించాడు.*+ 49  మండుతున్న తన కోపాన్ని,ఆగ్రహాన్ని, ఉగ్రతను, కష్టాల్ని,విపత్తు తీసుకురావడానికి దేవదూతల సమూహాల్ని వాళ్ల మీదికి పంపుతూ వచ్చాడు. 50  ఆయన తన కోపానికి దారిని సిద్ధం చేశాడు. మరణం నుండి వాళ్లను తప్పించలేదు;వాళ్లను తెగులుకు అప్పగించాడు. 51  చివరిగా, ఆయన ఐగుప్తీయుల మొదటి సంతానమంతటినీ,హాము డేరాల్లోని వాళ్ల తొలిచూలును చంపేశాడు.+ 52  తర్వాత గొర్రెల మందలా తన ప్రజల్ని బయటికి తీసుకొచ్చాడు,+ఎడారిలో వాళ్లను ఒక మందలా నడిపించాడు. 53  ఆయన వాళ్లను సురక్షితంగా నడిపించాడు,వాళ్లు దేనికీ భయపడలేదు;+సముద్రం వాళ్ల శత్రువుల్ని కప్పేసింది.+ 54  ఆయన వాళ్లను తన పవిత్ర దేశానికి,తన కుడిచెయ్యి సంపాదించుకున్న ఈ పర్వత ప్రాంతానికి+ తీసుకొచ్చాడు.+ 55  వాళ్ల ముందు నుండి దేశాల్ని తరిమేశాడు;+కొలనూలుతో వాళ్లకు స్వాస్థ్యాన్ని పంచి ఇచ్చాడు;+ఇశ్రాయేలు గోత్రాలవాళ్లు తమ ఇళ్లలో స్థిరపడేలా చేశాడు.+ 56  కానీ వాళ్లు సర్వోన్నతుడైన దేవుణ్ణి పరీక్షిస్తూ,* ఆయన మీద తిరుగుబాటు చేస్తూ వచ్చారు;+ఆయన జ్ఞాపికల మీద మనసు పెట్టలేదు.+ 57  వాళ్లు ఆయన్ని విడిచిపెట్టి తమ పూర్వీకులంత మోసపూరితంగా ప్రవర్తించారు.+ వదులుగా ఉన్న విల్లులా వాళ్లు నమ్మదగినవాళ్లు కాదు.+ 58  వాళ్లు తమ ఉన్నత స్థలాలతో ఆయనకు కోపం తెప్పిస్తూ వచ్చారు,+తమ చెక్కుడు విగ్రహాలతో ఆయనకు రోషం పుట్టించారు.+ 59  అదంతా చూసి దేవునికి చాలా కోపం వచ్చింది,+ఆయన ఇశ్రాయేలును పూర్తిగా తిరస్కరించాడు. 60  చివరికి ఆయన షిలోహులోని గుడారాన్ని,+మనుషుల మధ్య తాను నివసించిన గుడారాన్ని వదిలేశాడు.+ 61  తన బలానికి చిహ్నంగా ఉన్నదాన్ని చెరలోకి వెళ్లనిచ్చాడు;తన వైభవాన్ని శత్రువుల చేతుల్లోకి వెళ్లనిచ్చాడు.+ 62  ఆయన తన ప్రజల్ని ఖడ్గానికి అప్పగించాడు,+తన స్వాస్థ్యం మీద ఆయనకు చాలా కోపం వచ్చింది. 63  అగ్ని ఆయన యువకుల్ని దహించేసింది,ఆయన కన్యలకు పెళ్లిపాటలు లేకుండా పోయాయి.* 64  ఆయన యాజకులు కత్తి పాలయ్యారు,+వాళ్ల విధవరాళ్లు ఏడ్వలేదు.+ 65  అప్పుడు యెహోవా, నిద్ర నుండి లేచినట్టు లేచాడు,+బలవంతుడు+ ద్రాక్షారసం మత్తు నుండి లేచినట్టు లేచాడు. 66  ఆయన తన శత్రువుల్ని వెనక్కి తరిమేశాడు;+వాళ్లను శాశ్వత అవమానానికి గురిచేశాడు. 67  ఆయన యోసేపు డేరాను తిరస్కరించాడు;ఎఫ్రాయిము గోత్రాన్ని ఆయన ఎంచుకోలేదు. 68  బదులుగా యూదా గోత్రాన్ని,+తాను ప్రేమించే సీయోను పర్వతాన్ని ఎంచుకున్నాడు.+ 69  ఆయన తన పవిత్రమైన స్థలాన్ని ఎప్పటికీ ఉండే ఆకాశంలా,+తాను శాశ్వతంగా స్థిరపర్చిన భూమిలా చేశాడు.+ 70  ఆయన తన సేవకుడైన దావీదును ఎంచుకుని,+గొర్రెల దొడ్ల నుండి అతన్ని తీసుకుని, 71  పాలిచ్చే గొర్రెల్ని మేపుతున్న అతన్నియాకోబు మీద అంటే తన ప్రజల మీద,తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు మీద కాపరిగా నియమించాడు. 72  అతను యథార్థ హృదయంతో వాళ్లను కాశాడు,+నేర్పుతో వాళ్లను నడిపించాడు.

అధస్సూచీలు

పదకోశం చూడండి.
లేదా “ధర్మశాస్త్రం.”
అక్ష., “హృదయం సిద్ధంగా లేదు.”
లేదా “అద్భుతమైన పనుల్ని.”
లేదా “గోడలా.”
లేదా “సవాలు చేశారు.”
అక్ష., “భోజనం బల్ల సిద్ధం చేయగలడా?”
లేదా “దేవదూతల.”
లేదా “అద్భుతమైన పనుల.”
అక్ష., “బండరాయి.”
లేదా “తమ తరఫున పగ తీర్చుకునేవాడు.”
అక్ష., “కప్పేసేవాడు.”
లేదా “జీవశక్తి వెళ్లిపోతుంది, తిరిగి రాదని” అయ్యుంటుంది.
లేదా “నొప్పించారు.”
అక్ష., “చేతిని.”
అక్ష., “విడిపించిన.”
లేదా “వాళ్ల మందల్ని ఒళ్లు కాలిపోయే జ్వరానికి అప్పగించాడు” అయ్యుంటుంది.
లేదా “సవాలు చేస్తూ.”
అక్ష., “ఆయన కన్యలు స్తుతించబడలేదు.”