కీర్తనలు 9:1-20

  • దేవుని అద్భుతమైన పనుల్ని ప్రకటించడం

    • యెహోవా సురక్షితమైన ఆశ్రయం (9)

    • దేవుని పేరు తెలుసుకోవడం అంటే ఆయనమీద నమ్మకముంచడం (10)

సంగీత నిర్దేశకునికి సూచన; ముత్లబ్బేను* అనే రాగంలో పాడాలి. దావీదు శ్రావ్యగీతం. א [ఆలెఫ్‌] 9  యెహోవా, నిండు హృదయంతో నిన్ను స్తుతిస్తాను;నీ అద్భుతమైన పనులన్నిటి గురించి చెప్తాను.+   నేను నిన్ను బట్టి సంతోషిస్తాను, ఉల్లసిస్తాను;సర్వోన్నతుడా, నీ పేరును స్తుతిస్తూ పాటలు పాడతాను.*+ ב [బేత్‌]   నా శత్రువులు వెనుదిరిగినప్పుడు,+నీ ఎదుట తడబడి నాశనమౌతారు.   ఎందుకంటే, నువ్వు నా తరఫున వాదించి న్యాయం చేస్తావు;నీ సింహాసనం మీద కూర్చొని నీతిగా తీర్పు తీరుస్తావు.+ ג [గీమెల్‌]   నువ్వు దేశాల్ని గద్దించావు,+ దుష్టుల్ని నాశనం చేశావు,వాళ్ల పేర్లను శాశ్వతంగా తుడిచిపెట్టావు.   శత్రువు పూర్తిగా నాశనమయ్యాడు;నువ్వు వాళ్ల నగరాల్ని పెకిలించి వేశావు, వాళ్ల జ్ఞాపకాలన్నీ లేకుండా పోతాయి.+ ה [హే]   కానీ యెహోవా ఎప్పటికీ తన సింహాసనం మీద కూర్చుంటాడు;+న్యాయం తీర్చడానికి ఆయన తన సింహాసనాన్ని స్థిరపర్చాడు.+   ఆయన నీతిని బట్టి భూనివాసులకు* తీర్పు తీరుస్తాడు;+దేశాలకు నీతిగల తీర్పుల్ని ఇస్తాడు.+ ו [వావ్‌]   అణచివేయబడిన వాళ్లకు యెహోవా సురక్షితమైన ఆశ్రయం* అవుతాడు,+కష్ట కాలాల్లో సురక్షితమైన ఆశ్రయంగా ఉంటాడు.+ 10  నీ పేరు తెలిసినవాళ్లు నీ మీద నమ్మకముంచుతారు;+యెహోవా, నిన్ను వెదికేవాళ్లను నువ్వు ఎన్నడూ వదిలేయవు.+ ז [జాయిన్‌] 11  సీయోనులో నివసిస్తున్న యెహోవాను స్తుతిస్తూ పాటలు పాడండి;దేశదేశాల ప్రజల మధ్య ఆయన కార్యాల్ని తెలియజేయండి.+ 12  బాధితుల్ని గుర్తుచేసుకొని వాళ్ల రక్తం విషయంలో పగతీర్చుకునే దేవుడు వాళ్లను గుర్తుచేసుకుంటాడు;+వాళ్ల మొరను ఆయన మర్చిపోడు.+ ח [హేత్‌] 13  మరణ ద్వారాల నుండి నన్ను పైకెత్తే యెహోవా,+ నా మీద అనుగ్రహం చూపించు;నన్ను ద్వేషించేవాళ్ల వల్ల నేను పడుతున్న బాధను చూడు, 14  అప్పుడు నేను స్తుతిపాత్రమైన నీ కార్యాల్ని సీయోను కూతురి ద్వారాల దగ్గర ప్రకటిస్తాను,+నీ రక్షణ కార్యాల్ని బట్టి ఉల్లసిస్తాను.+ ט [తేత్‌] 15  దేశాలు తాము తవ్విన గుంటలోనే కూరుకుపోయాయి;అవి పన్నిన వలలో వాటి పాదాలే చిక్కుకుపోయాయి.+ 16  యెహోవా ఎలాంటివాడో ఆయన విధించే తీర్పుల్ని బట్టి తెలుస్తుంది.+ దుష్టుడు తన పనులవల్లే చిక్కుకుపోతాడు.+ హిగ్గాయోన్‌.* (సెలా) י [యోద్‌] 17  దుష్టులు సమాధిలోకి* వెళ్తారు,దేవుణ్ణి మర్చిపోయిన దేశాలన్నీ అక్కడికే వెళ్తాయి. 18  అయితే, పేదవాళ్లు ఎల్లకాలం మరవబడరు;+సాత్వికుల ఆశ ఎప్పటికీ నశించిపోదు.+ כ [కఫ్‌] 19  యెహోవా, లేచి దేశాలకు తీర్పు తీర్చు!+ మనిషిని నీ మీద విజయం సాధించనివ్వకు. 20  యెహోవా, వాళ్లలో భయం పుట్టించు,+తాము కేవలం మనుషులమని వాళ్లంతా తెలుసుకోవాలి. (సెలా)

అధస్సూచీలు

పదకోశం చూడండి.
లేదా “సంగీతం వాయిస్తాను.”
లేదా “పండే భూమికి.”
లేదా “ఎత్తైన స్థలం.”
పదకోశం చూడండి.
లేదా “షియోల్‌లోకి,” అంటే మానవజాతి సాధారణ సమాధిలోకి. పదకోశం చూడండి.