కీర్తనలు 117:1, 2

  • యెహోవాను స్తుతించమని అన్ని దేశాలకు పిలుపు

    • దేవుని విశ్వసనీయ ప్రేమ గొప్పది (2)

117  సమస్త దేశాల్లారా, యెహోవాను స్తుతించండి;+దేశదేశాల ప్రజలారా, మీరంతా ఆయన్ని మహిమపర్చండి.+   ఎందుకంటే, మనమీద ఆయనకున్న విశ్వసనీయ ప్రేమ గొప్పది;+యెహోవా నమ్మకత్వం+ ఎప్పటికీ ఉంటుంది.+ యెహోవాను* స్తుతించండి!*+

అధస్సూచీలు

అక్ష., “యా.” ఇది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.
లేదా “హల్లెలూయా!”