కీర్తనలు 13:1-6

  • యెహోవా రక్షణ కోసం ఎదురుచూడడం

    • “యెహోవా, ఎంతకాలం?” (1, 2)

    • యెహోవా మెండుగా ఆశీర్వదిస్తాడు (6)

సంగీత నిర్దేశకునికి సూచన. దావీదు శ్రావ్యగీతం. 13  యెహోవా, ఎంతకాలం నన్ను మర్చిపోతావు? ఎప్పటికీనా? ఎన్నాళ్లు నీ ముఖాన్ని నాకు కనబడకుండా దాచుకుంటావు?+  2  ప్రతీరోజు హృదయ వేదన అనుభవిస్తూనేను ఎంతకాలం ఆందోళనపడాలి? నా శత్రువు ఇంకా ఎంతకాలం నా మీద విజయం సాధిస్తూ ఉంటాడు?+  3  యెహోవా, నా దేవా, నామీద దృష్టి ఉంచి నాకు జవాబివ్వు. నేను చనిపోకుండా* ఉండేలా నా కళ్లకు వెలుగివ్వు,  4  అప్పుడు నా శత్రువు, “నేను అతన్ని ఓడించాను” అని అనడు. నా పతనాన్ని బట్టి నా విరోధుల్ని ఉల్లసించనివ్వకు.+  5  నాకైతే, నీ విశ్వసనీయ ప్రేమ మీద నమ్మకం ఉంది;+నా హృదయం నీ రక్షణ కార్యాల్ని బట్టి సంతోషిస్తుంది.+  6  నేను యెహోవాకు పాట పాడతాను, ఎందుకంటే ఆయన నన్ను మెండుగా ఆశీర్వదించాడు.*+

అధస్సూచీలు

అక్ష., “మరణంలో నిద్రించకుండా.”
లేదా “నాతో మంచిగా వ్యవహరించాడు.”