కీర్తనలు 64:1-10

  • రహస్య పన్నాగాల నుండి కాపుదల

    • “దేవుడు వాళ్ల మీద బాణాలు వేస్తాడు” (7)

సంగీత నిర్దేశకునికి సూచన. దావీదు శ్రావ్యగీతం. 64  దేవా, నేను మొరపెట్టినప్పుడు నా ప్రార్థన విను.+ శత్రుభయం నుండి నా ప్రాణాన్ని కాపాడు.   దుష్టుల రహస్య పన్నాగాల+ నుండి,తప్పు చేసేవాళ్ల గుంపు నుండి నన్ను కాపాడు.   కత్తికి పదును పెట్టినట్టు వాళ్లు తమ నాలుకకు పదును పెడతారు;కఠినమైన మాటల్ని బాణాల్లా ఎక్కుపెట్టి,   తాము దాక్కున్న చోట్ల నుండి అమాయకుడి మీదికి వాటిని సంధిస్తారు;ఏమాత్రం భయపడకుండా హఠాత్తుగా వాటిని అతని మీదికి వదులుతారు.   వాళ్లు చెడు చేయడానికి ఒకరినొకరు ప్రోత్సహించుకుంటారు;*రహస్యంగా ఎలా ఉచ్చులు పెట్టాలో మాట్లాడుకుంటారు. “వాటిని ఎవరు చూస్తారులే?” అని వాళ్లంటారు.+   తప్పు చేయడానికి వాళ్లు కొత్తకొత్త దారులు వెదుకుతారు;దొంగచాటుగా యుక్తితో పన్నాగాలు పన్నుతారు;+వాళ్లలో ప్రతీ ఒక్కరి హృదయాలోచన చాలా లోతుగా ఉంది.   కానీ దేవుడు వాళ్ల మీద బాణాలు వేస్తాడు;+వాళ్లు హఠాత్తుగా బాణం వల్ల గాయ​పడతారు.   వాళ్ల నాలుకే వాళ్ల పతనానికి కారణం;+దాన్ని చూసేవాళ్లంతా తలలు ఆడిస్తారు.   అప్పుడు మనుషులంతా భయపడి,దేవుడు చేసినదాన్ని ప్రకటిస్తారు,ఆయన పనుల్ని లోతుగా అర్థం ​చేసుకుంటారు.+ 10  నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించి, ఆయన్ని ఆశ్రయిస్తారు;+హృదయంలో నిజాయితీ ఉన్న ​వాళ్లందరూ ఉల్లసిస్తారు.*

అధస్సూచీలు

లేదా “తమ దురాలోచనను అంటిపెట్టుకునే ఉంటారు.”
లేదా “ఆయన్ని బట్టి గొప్పలు చెప్పుకుంటారు.”