కీర్తనలు 115:1-18

  • దేవునికి మాత్రమే మహిమ చెల్లించాలి

    • ప్రాణంలేని విగ్రహాలు (4-8)

    • భూమిని మనుషులకు ఇచ్చాడు (16)

    • ‘చనిపోయినవాళ్లు యెహోవాను స్తుతించరు’ (17)

115  మాకు కాదు యెహోవా, మాకు కాదు,*నీ విశ్వసనీయ ప్రేమను బట్టి, నీ నమ్మకత్వాన్ని బట్టినీ పేరుకే మహిమ కలగాలి.+   “వాళ్ల దేవుడు ఎక్కడ?” అని దేశాలు ఎందుకు అనాలి?+   మన దేవుడు పరలోకంలో ఉన్నాడు;ఆయన తనకు నచ్చిందంతా చేస్తాడు.   వాళ్ల విగ్రహాలు వెండిబంగారాలతో చేసినవి,అవి మనుషుల చేతిపనులు.+   వాటికి నోరు ఉంది, కానీ మాట్లాడలేవు;+కళ్లు ఉన్నాయి, కానీ చూడలేవు;   చెవులు ఉన్నాయి, కానీ వినలేవు;ముక్కు ఉంది, కానీ వాసన చూడలేవు;   చేతులు ఉన్నాయి, కానీ ముట్టుకోలేవు;పాదాలు ఉన్నాయి, కానీ నడవలేవు;+గొంతుతో శబ్దం చేయలేవు.+   వాటిని తయారుచేసేవాళ్లూ, వాటిని నమ్ముకునే వాళ్లందరూఅచ్చం వాటిలాగే తయారౌతారు.+   ఇశ్రాయేలూ, యెహోవాను నమ్ముకో,+ఆయనే నీ సహాయకుడు, నీ డాలు.+ 10  అహరోను ఇంటివాళ్లారా,+ యెహోవాను నమ్ముకోండి,ఆయనే మీ సహాయకుడు, మీ డాలు. 11  యెహోవాకు భయపడేవాళ్లారా, యెహోవాను నమ్ముకోండి,+ఆయనే మీ సహాయకుడు, మీ డాలు.+ 12  యెహోవా మనల్ని గుర్తుచేసుకుంటాడు, మనల్ని దీవిస్తాడు;ఆయన ఇశ్రాయేలు ఇంటివాళ్లను దీవిస్తాడు;+అహరోను ఇంటివాళ్లను దీవిస్తాడు; 13  సామాన్యులైనా, గొప్పవాళ్లయినాతనకు భయపడేవాళ్లను యెహోవా దీవిస్తాడు. 14  యెహోవా మిమ్మల్ని వృద్ధి చేస్తాడు,మిమ్మల్ని, మీ పిల్లల్ని* వృద్ధి చేస్తాడు.+ 15  భూమ్యాకాశాల్ని తయారుచేసినయెహోవా+ మిమ్మల్ని దీవించాలి.+ 16  ఆకాశం యెహోవాది,+అయితే భూమిని ఆయన మనుషులకు ఇచ్చాడు.+ 17  చనిపోయినవాళ్లు,మౌనస్థితిలోకి* దిగిపోయేవాళ్లు+ యెహోవాను* స్తుతించరు.+ 18  మనం మాత్రం ఇప్పటినుండి సదాకాలంయెహోవాను* స్తుతిస్తాం. యెహోవాను* స్తుతించండి!*

అధస్సూచీలు

లేదా “మాకేం చెందదు, యెహోవా, మాకేం చెందదు.”
అక్ష., “కుమారుల్ని.”
లేదా “సమాధిలోకి.”
అక్ష., “యా.” ఇది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.
అక్ష., “యా.” ఇది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.
అక్ష., “యా.” ఇది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.
లేదా “హల్లెలూయా!”