కీర్తనలు 8:1-9

  • దేవుని మహిమ, మనిషికి ఇచ్చిన ఘనత

    • “నీ పేరు ఎంత ఘనమైనది!” (1, 9)

    • “మనిషి ఎంతటివాడు?” (4)

    • మనిషికి వైభవాన్ని కిరీటంగా పెట్టాడు (5)

సంగీత నిర్దేశకునికి సూచన; గిత్తీత్‌* అనే రాగంలో పాడాలి. దావీదు శ్రావ్యగీతం. 8  యెహోవా, మా ప్రభువా, భూమంతటా నీ పేరు ఎంత ఘనమైనది!నువ్వు నీ మహిమను ఆకాశం కన్నా ఎత్తుగా ఉంచావు!*+   శత్రువు నోటిని, పగతీర్చుకునేవాడి నోటిని మూయించడానికినువ్వు పిల్లల, చంటిబిడ్డల నోటి నుండి వచ్చే మాటల+ ద్వారానీ శత్రువులకు నీ బలాన్ని చూపించావు.   నేను నీ చేతి* పని అయిన నీ ఆకాశాన్ని,నువ్వు చేసిన చంద్రుణ్ణి, నక్షత్రాల్ని+ చూసినప్పుడు నాకు ఇలా అనిపిస్తుంది:   నువ్వు గుర్తుంచుకోవడానికి మనిషి ఎంతటివాడు?నువ్వు శ్రద్ధ చూపించడానికి మనిషికి పుట్టినవాడు ఎంతటివాడు?+   నువ్వు అతన్ని దేవదూతల* కన్నా కాస్త తక్కువవాడిగా చేశావు,మహిమ, వైభవాల్ని అతనికి కిరీటంలా పెట్టావు.   నీ చేతులతో చేసినవాటి మీద అతనికి అధికారం ఇచ్చావు;+సమస్తాన్ని అతని పాదాల కింద ఉంచావు:   మందల్ని, పశువుల్ని,అడవి జంతువుల్ని,+   ఆకాశ పక్షుల్ని, సముద్రంలోని చేపల్ని,సముద్రాల్లో తిరిగే ప్రతీదాన్ని అతని పాదాల కింద ఉంచావు.   యెహోవా, మా ప్రభువా, భూమంతటా నీ పేరు ఎంత ఘనమైనది!

అధస్సూచీలు

పదకోశం చూడండి.
లేదా “నీ మహిమ గురించి ఆకాశం పైన చెప్పుకుంటారు” అయ్యుంటుంది.
అక్ష., “చేతివేళ్ల.”
లేదా “దేవునిలాంటి వాళ్ల.”