కీర్తనలు 48:1-14

  • సీయోను, మహారాజు నగరం

    • భూమంతటికీ సంతోష కారణం (2)

    • నగరాన్ని, దాని బురుజుల్ని జాగ్రత్తగా పరిశీలించండి (11-13)

గీతం. కోరహు కుమారుల శ్రావ్యగీతం.+ 48  మన దేవుని నగరంలో, ఆయన పవిత్ర పర్వతం మీదయెహోవా గొప్పవాడు, అత్యంత స్తుతిపాత్రుడు.   ఉత్తర దిక్కున సుదూరంలో ఉన్న సీయోను పర్వతంఅందంగా, ఎత్తులో ఉంది,అది భూమంతటికీ సంతోష కారణంగా ఉంది.+ అది మహారాజు నగరం.+   దాని పటిష్ఠమైన బురుజుల్లోతాను సురక్షితమైన ఆశ్రయమని* దేవుడు తెలియజేశాడు.+   ఇదిగో! రాజులు సమకూడారు;*వాళ్లంతా కలిసి ముందుకు సాగారు.   దాన్ని చూసినప్పుడు వాళ్లు ఆశ్చర్య​పోయారు. కంగారుపడి భయంతో పారిపోయారు.   అక్కడ వాళ్లు గజగజ వణికిపోయారు,ప్రసవించే స్త్రీలా వేదన పడ్డారు.   తూర్పు గాలితో నువ్వు తర్షీషు ఓడల్ని బద్దలు చేస్తున్నావు.   మేము దేని గురించైతే విన్నామో దాన్ని ఇప్పుడు స్వయంగా చూశాం,సైన్యాలకు అధిపతైన యెహోవా ​నగరంలో, మన దేవుని నగరంలో దాన్ని చూశాం. దేవుడు ఆ నగరాన్ని శాశ్వతంగా ​స్థిరపరుస్తాడు.+ (సెలా)   దేవా, నీ ఆలయంలోమేము నీ విశ్వసనీయ ప్రేమ గురించి ధ్యానిస్తాం.+ 10  దేవా, నీ పేరులాగే నీ స్తుతి కూడాభూమి నలుమూలలకు వ్యాపిస్తోంది.+ నీ కుడిచెయ్యి నీతితో నిండిపోయింది.+ 11  నీ తీర్పుల్ని బట్టి సీయోను పర్వతం+ ​ఉల్లసించాలి,యూదా పట్టణాలు* సంతోషించాలి.+ 12  సీయోను చుట్టూ తిరగండి; దాని మూలమూలలకు వెళ్లి చూడండి;దాని బురుజులు లెక్కపెట్టండి.+ 13  రాబోయే తరాలకు దాని గురించి చెప్ప​గలిగేలా దాని ప్రాకారాల్ని*+ శ్రద్ధగా గమనించండి.దాని పటిష్ఠమైన బురుజుల్ని జాగ్రత్తగా పరిశీలించండి. 14  ఈ దేవుడు యుగయుగాలూ మనకు దేవుడు.+ ఆయన ఎప్పటికీ* మనల్ని నడిపిస్తాడు.+

అధస్సూచీలు

లేదా “ఎత్తైన స్థలమని.”
లేదా “ముందే అనుకొని కలుసుకున్నారు.”
అక్ష., “కూతుళ్లు.”
లేదా “కోట గోడల్ని.”
లేదా “మనం చనిపోయే దాకా” అయ్యుంటుంది.