కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

14వ ప్రశ్న

మీకున్న వాటిని ఎలా ఉపయోగించాలి?

“సుఖాల్ని ప్రేమించేవాళ్లు పేదవాళ్లౌతారు; ద్రాక్షారసాన్ని, నూనెను ప్రేమించేవాళ్లు ధనవంతులు అవ్వరు.”

సామెతలు 21:17

“అప్పు చేసినవాడు అప్పిచ్చినవాడికి దాసుడు.”

సామెతలు 22:7

“మీలో ఒక వ్యక్తి భవనం కట్టాలనుకుంటే, దాన్ని పూర్తిచేయడానికి కావాల్సినంత డబ్బు తన దగ్గర ఉందో లేదో చూడడానికి ముందుగా కూర్చొని లెక్కలు వేసుకోడా? అలా లెక్కలు వేసుకోకపోతే, అతను పునాది వేసినా దాన్ని పూర్తి చేయలేకపోవచ్చు. అప్పుడు చూసేవాళ్లందరూ అతన్ని ఎగతాళి చేస్తూ, ‘ఇతను కట్టడం మొదలుపెట్టాడు కానీ పూర్తి చేయలేకపోయాడు’ అంటారు.”

లూకా 14:​28-30

“ప్రజలు కడుపునిండా తిన్నాక యేసు తన శిష్యులతో, ‘మిగిలిన ముక్కలు పోగుచేయండి, ఏదీ వృథా కానివ్వకండి’ అన్నాడు.”

యోహాను 6:12