కీర్తనలు 132:1-18

  • దావీదును, సీయోనును ఎంచుకోవడం

    • “నీ అభిషిక్తుణ్ణి తిరస్కరించకు” (10)

    • సీయోను యాజకులకు రక్షణను వస్త్రంలా తొడగడం (16)

యాత్ర కీర్తన. 132  యెహోవా, దావీదునూఅతను పడిన బాధలన్నిటినీ+ గుర్తుచేసుకో;   అతను యెహోవాకు చేసిన ప్రమాణాన్ని,యాకోబు శక్తిమంతునికి అతను చేసుకున్న మొక్కుబడిని+ గుర్తుచేసుకో. అతనిలా అన్నాడు:   “నేను నా డేరాలోకి, నా ఇంట్లోకి+ వెళ్లను. నా మంచం మీద, నా పరుపు మీద పడుకోను;   నా కళ్లకు నిద్ర గానీనా కనురెప్పలకు కునుకు గానీ రానివ్వను;   యెహోవా కోసం ఒక స్థలం, యాకోబు శక్తిమంతుని కోసం శ్రేష్ఠమైన నివాసం* దొరికేవరకు నేను నిద్రపోను.”+   ఇదిగో! ఎఫ్రాతాలో+ మేము దాని గురించి విన్నాం;అడవి ప్రాంతంలో దాన్ని కనుగొన్నాం.+   రండి, మనం ఆయన నివాసంలోకి* వెళ్దాం;+ఆయన పాదపీఠం దగ్గర వంగి నమస్కారం చేద్దాం.+   యెహోవా, లేచి, నీ బలానికి సూచనగా ఉన్న మందసంతో* పాటునీ విశ్రాంతి స్థలంలోకి ప్రవేశించు.+   నీ యాజకులు నీతిని వస్త్రంలా ధరించుకోవాలి,నీ విశ్వసనీయులు సంతోషంతో కేకలు వేయాలి. 10  నీ సేవకుడైన దావీదు కోసంనీ అభిషిక్తుణ్ణి+ తిరస్కరించకు. 11  యెహోవా దావీదుతో ప్రమాణం చేశాడు;ఆయన తన మాటను వెనక్కి తీసుకోడు, ఆయనిలా అన్నాడు: “నీ సంతానంలో* ఒకర్నినీ సింహాసనం మీద కూర్చోబెడతాను.+ 12  నీ కుమారులు నా ఒప్పందానికి కట్టుబడి ఉంటే,నేను వాళ్లకు బోధించిన నా జ్ఞాపికల్ని పాటిస్తే,+వాళ్ల వంశస్థులు కూడాఎప్పటికీ నీ సింహాసనం మీద కూర్చుంటారు.”+ 13  ఎందుకంటే యెహోవా సీయోనును ఎంచుకున్నాడు;+ఆయన తన నివాస స్థలంగా దాన్ని కోరుకున్నాడు,+ ఆయనిలా అన్నాడు: 14  “ఎప్పటికీ ఇదే నా విశ్రాంతి స్థలం;ఇక్కడే నేను నివసిస్తాను,+ ఎందుకంటే అది నా కోరిక. 15  నేను దాన్ని ఆహారంతో దీవిస్తాను;దానిలోని పేదవాళ్లను రొట్టెతో తృప్తిపరుస్తాను.+ 16  దాని యాజకులకు రక్షణను వస్త్రంలా తొడుగుతాను,+దానిలోని విశ్వసనీయులు సంతోషంతో కేకలు వేస్తారు. 17  అక్కడ నేను దావీదు కొమ్మును* హెచ్చిస్తాను. నా అభిషిక్తుని కోసం నేనొక దీపాన్ని సిద్ధం చేశాను.+ 18  నేను అతని శత్రువుల్ని సిగ్గుతో కప్పేస్తాను,అయితే అతని తల మీదున్న కిరీటం వర్ధిల్లుతుంది.”+

అధస్సూచీలు

లేదా “ఘనమైన గుడారం.”
లేదా “ఆయన ఘనమైన గుడారంలోకి.”
లేదా “పెద్దపెట్టెతో.”
లేదా “గర్భఫలంలో.”
లేదా “బలాన్ని.”