కీర్తనలు 85:1-13

  • పునరుద్ధరించమని ప్రార్థన

    • దేవుడు తన విశ్వసనీయులకు శాంతిని ప్రకటిస్తాడు (8)

    • విశ్వసనీయ ప్రేమ, నమ్మకత్వం కలుసుకుంటాయి (10)

సంగీత నిర్దేశకునికి సూచన. కోరహు కుమారుల కీర్తన.+ శ్రావ్యగీతం. 85  యెహోవా, నీ దేశం మీద నువ్వు అనుగ్రహం చూపించావు;+చెరలోకి వెళ్లిన యాకోబు పిల్లల్ని వెనక్కి తీసుకొచ్చావు.+   నీ ప్రజల తప్పుల్ని మన్నించావు;వాళ్ల పాపాలన్నీ క్షమించావు.*+ (సెలా)   నీ ఆగ్రహమంతా అణుచుకున్నావు;నీ కోపాగ్నిని చల్లార్చుకున్నావు.+   మా రక్షకుడివైన దేవా, మమ్మల్ని మళ్లీ సమకూర్చు,*మా మీద నీకున్న కోపాన్ని పక్కనపెట్టు.   ఎప్పటికీ మా మీద మండిపడుతూ ఉంటావా?+ తరతరాలు నీ కోపాన్ని చూపిస్తూనే ఉంటావా?   నీ ప్రజలు నిన్ను బట్టి సంతోషించేలామళ్లీ మాలో కొత్త బలాన్ని నింపవా?+   యెహోవా, మా మీద నీ విశ్వసనీయ ప్రేమ చూపించు,+నీ రక్షణను మాకు దయచేయి.   సత్యదేవుడైన యెహోవా చెప్పేది నేను వింటాను.ఎందుకంటే ఆయన తన ప్రజలకు, తన విశ్వసనీయులకు శాంతిని ​ప్రకటిస్తాడు.+అయితే వాళ్లు మళ్లీ మితిమీరిన ​ఆత్మవిశ్వాసం చూపించకూడదు.+   ఆయన మహిమ మన దేశంలో ​నివసించేలా,ఆయనకు భయపడేవాళ్లకు ఆయన రక్షణ దగ్గర్లో ఉంది.+ 10  విశ్వసనీయ ప్రేమ, నమ్మకత్వం ​కలుసుకుంటాయి;నీతి, శాంతి ఒకదానినొకటి ముద్దుపెట్టుకుంటాయి.+ 11  నమ్మకత్వం నేలలో నుండి మొలకెత్తుతుంది,నీతి ఆకాశం నుండి కిందికి చూస్తుంది.+ 12  అవును, యెహోవా మంచివాటిని ఇస్తాడు,+మన భూమి దాని పంటను ఇస్తుంది.+ 13  నీతి ఆయన ముందు నడుస్తుంది,+ఆయన అడుగుల కోసం దారిని సిద్ధం చేస్తుంది.

అధస్సూచీలు

అక్ష., “కప్పేశావు.”
లేదా “ఒక​ప్పటి స్థితికి తీసుకురా.”