కీర్తనలు 28:1-9

  • కీర్తనకర్త ప్రార్థనను దేవుడు విన్నాడు

    • “యెహోవా నా బలం, నా డాలు” (7)

దావీదు కీర్తన. 28  యెహోవా, నా ఆశ్రయదుర్గమా,*+ నేను నీకు మొరపెడుతూ ఉన్నాను;నన్ను నిర్లక్ష్యం చేయకు. నువ్వు నా విషయంలో మౌనంగా ఉంటే,నేను గోతిలోకి* దిగిపోయేవాళ్లలా అవుతాను.+  2  నేను నీ పవిత్రమైన స్థలంలోని అత్యంత లోపలి గది వైపు నా చేతులెత్తిసహాయం కోసం నీకు మొరపెట్టినప్పుడు+ నా విన్నపాల్ని ఆలకించు.  3  దుష్టులతో, కీడు చేసేవాళ్లతో నన్ను ఈడ్చేయకు.+వాళ్లు తమ హృదయాల్లో చెడు ఉంచుకొని తోటివాళ్లతో శాంతిగా మాట్లాడతారు.+  4  వాళ్ల క్రియల్ని బట్టి,వాళ్ల చెడు పనుల్ని బట్టి వాళ్లకు ప్రతిఫలం ఇవ్వు.+ వాళ్ల చేతి పనిని బట్టి,వాళ్లు చేసినదాన్ని బట్టి వాళ్లకు ప్రతీకారం చేయి.+  5  ఎందుకంటే, వాళ్లు యెహోవా కార్యాల్ని గానీ,ఆయన చేతి పనిని గానీ పట్టించుకోరు.+ ఆయన వాళ్లను కింద పడేస్తాడు, కానీ లేపడు.  6  యెహోవా స్తుతించబడాలి,సహాయం కోసం నేను చేసిన ప్రార్థనల్ని ఆయన ఆలకించాడు.  7  యెహోవా నా బలం,+ నా డాలు;+నా హృదయం ఆయన మీద నమ్మకం పెట్టుకుంది.+ నేను ఆయన సహాయాన్ని పొందాను, నా హృదయం ఉల్లసిస్తోంది,అందుకే నా పాటతో నేను ఆయన్ని స్తుతిస్తాను.  8  యెహోవా తన ప్రజలకు బలం;తన అభిషిక్తునికి గొప్ప రక్షణ తీసుకొచ్చే కోట.+  9  నీ ప్రజల్ని కాపాడు, నీ స్వాస్థ్యాన్ని దీవించు.+ వాళ్ల కాపరిగా ఉండి, వాళ్లను ఎప్పటికీ నీ బాహువుల్లో మోయి.+

అధస్సూచీలు

అక్ష., “బండరాయీ.”
లేదా “సమాధిలోకి.”