కీర్తనలు 41:1-13

  • మంచం పట్టినప్పుడు చేసిన ప్రార్థన

    • అనారోగ్యంతో బాధపడుతున్నవాళ్లను దేవుడు ఆదుకుంటాడు (3)

    • దగ్గరి స్నేహితుడు నమ్మకద్రోహం చేశాడు (9)

సంగీత నిర్దేశకునికి సూచన. దావీదు శ్రావ్యగీతం. 41  దీనులకు సహాయం చేసే వ్యక్తి సంతోషంగా ఉంటాడు;+విపత్తు రోజున యెహోవా అతన్ని రక్షిస్తాడు.   యెహోవా అతన్ని సంరక్షించి సజీవంగా ఉంచుతాడు. అతను భూమ్మీద సంతోషంగల వ్యక్తిగా ఎంచబడతాడు;+నువ్వు ఎన్నడూ అతని శత్రువుల ఇష్టానికి* అతన్ని అప్పగించవు.+   అతను అనారోగ్యంతో మంచం పట్టినప్పుడు యెహోవా అతన్ని ఆదుకుంటాడు;+అతను అనారోగ్యంగా ఉన్నప్పుడు నువ్వు అతని పడకను పూర్తిగా మార్చేస్తావు.   “యెహోవా, నా మీద అనుగ్రహం చూపించు.+ నన్ను బాగుచేయి,+ నేను నీకు వ్యతిరేకంగా పాపం చేశాను”+ అని నేను అన్నాను.   కానీ నా శత్రువులు, “అతను ఎప్పుడు చస్తాడో, అతని పేరు ఎప్పుడు తుడిచిపెట్టుకుపోతుందో” అంటూ నా గురించి చెడుగా మాట్లాడుతున్నారు.   వాళ్లలో ఎవరైనా నన్ను చూడడానికి వస్తే, అతను* కపటంగా మాట్లాడతాడు. నా గురించి చెడుగా మాట్లాడడానికి అతను సమాచారం సేకరిస్తాడు;తర్వాత బయటికి వెళ్లి, దాని గురించి అంతటా చెప్తాడు.   నన్ను ద్వేషించేవాళ్లంతా గుసగుసలాడుకుంటున్నారు;నాకు కీడు చేయాలని కుట్ర పన్నుతున్నారు:   “అతని మీదికి ఒక పెద్ద విపత్తు వచ్చింది;అతను పడిపోయాడు, మళ్లీ లేవడు” అని వాళ్లు అనుకుంటున్నారు.+   నేను నమ్మిన నా దగ్గరి స్నేహితుడు,+నాతోపాటు భోజనం చేస్తూ వచ్చిన వ్యక్తి నాకు శత్రువు అయ్యాడు.*+ 10  కానీ యెహోవా, నేను వాళ్లకు ప్రతీకారం చేసేలానా మీద అనుగ్రహం చూపించి, నన్ను పైకి లేపు. 11  నా శత్రువులు నా మీద గెలవలేకపోయినప్పుడు, నువ్వు నన్ను చూసి సంతోషిస్తున్నావని నాకు తెలుస్తుంది.+ 12  నా యథార్థతను బట్టి నువ్వు నన్ను ఆదుకుంటున్నావు;+నన్ను శాశ్వతంగా నీ సన్నిధిలో ఉంచుకుంటావు.+ 13  ఇశ్రాయేలు దేవుడైన యెహోవాశాశ్వతకాలం* స్తుతించబడాలి.+ ఆమేన్‌. ఆమేన్‌.

అధస్సూచీలు

లేదా “కోరికకు; ప్రాణానికి.” పదకోశంలో “ప్రాణం” చూడండి.
అక్ష., “అతని హృదయం.”
అక్ష., “నా మీదికి తన మడిమె ఎత్తాడు.”
లేదా “శాశ్వతకాలం నుండి శాశ్వతకాలం వరకు.”