కీర్తనలు 67:1-7

  • భూమ్మీదున్న ప్రజలందరూ దేవునికి భయపడతారు

    • దేవుని మార్గం తెలుస్తుంది (2)

    • ‘దేశదేశాల ప్రజలు దేవుణ్ణి స్తుతించాలి’ (3, 5)

    • “దేవుడు మమ్మల్ని దీవిస్తాడు” (6, 7)

సంగీత నిర్దేశకునికి సూచన; తంతివాద్యాలతో పాడాలి. శ్రావ్యగీతం. గీతం. 67  దేవుడు మా మీద దయ చూపించి మమ్మల్ని దీవిస్తాడు;తన ముఖకాంతిని మా మీద ప్రకాశింపజేస్తాడు,+ (సెలా)   అప్పుడు నీ మార్గం గురించి భూమంతటా తెలుస్తుంది;+అన్ని దేశాలవాళ్లు నీ రక్షణ కార్యాల గురించి తెలుసుకుంటారు.+   దేవా, దేశదేశాల ప్రజలు నిన్ను స్తుతించాలి;ప్రజలందరూ నిన్ను స్తుతించాలి.   దేశాలు ఉల్లసించి, సంతోషంతో కేకలు వేయాలి,+ఎందుకంటే నువ్వు వాటికి న్యాయంగా తీర్పు తీరుస్తావు.+ భూమ్మీదున్న దేశాల్ని నువ్వు నడిపిస్తావు. (సెలా)   దేవా, దేశదేశాల ప్రజలు నిన్ను స్తుతించాలి;ప్రజలందరూ నిన్ను స్తుతించాలి.   భూమి దాని పంటను ఇస్తుంది;+దేవుడు, మా దేవుడు మమ్మల్ని దీవిస్తాడు.+   దేవుడు మమ్మల్ని దీవిస్తాడు, భూమ్మీదున్న ప్రజలందరూ ఆయనకు భయపడతారు.*+

అధస్సూచీలు

లేదా “ఆయన్ని ఘనపరుస్తారు.”