కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

2వ ప్రశ్న

దేవుని గురించి నేర్చుకోవడం ఎలా?

“నువ్వు ధర్మశాస్త్రంలోని విషయాల గురించి మాట్లాడడం మానేయకూడదు, దానిలో రాయబడి ఉన్నవాటన్నిటినీ జాగ్రత్తగా పాటించేలా పగలూ రాత్రీ దాన్ని ధ్యానించాలి; అప్పుడే నువ్వు విజయం సాధిస్తావు, తెలివిగా నడుచుకుంటావు.”

యెహోషువ 1:8

“వాళ్లు ఆ గ్రంథాన్ని, అంటే సత్యదేవుని ధర్మశాస్త్రాన్ని బిగ్గరగా చదువుతూ, దాన్ని స్పష్టంగా వివరిస్తూ, ఆ మాటల అర్థాన్ని చెప్పారు. అలా వాళ్లు, చదువుతున్న దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రజలకు సహాయం చేశారు.”

నెహెమ్యా 8:8

‘దుష్టుల సలహా ప్రకారం నడుచుకోకుండా ఉండే వ్యక్తి సంతోషంగా ఉంటాడు. అతను యెహోవా ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందిస్తూ, పగలూ రాత్రీ దాన్ని ధ్యానిస్తాడు. అతను చేసే ప్రతీది సఫలమౌతుంది.’

కీర్తన 1:​1-3

“అప్పుడు ఫిలిప్పు రథం పక్కనే పరుగెత్తుతూ, ఆ వ్యక్తి యెషయా ప్రవక్త గ్రంథాన్ని బిగ్గరగా చదువుతుండడం విని, ‘నువ్వు చదువుతున్నది నీకు అర్థమౌతోందా?’ అని అడిగాడు. అందుకు అతను, ‘ఎవరో ఒకరు విడమర్చి చెప్పకపోతే నాకెలా అర్థమౌతుంది?’ అన్నాడు.”

అపొస్తలుల కార్యాలు 8:​30, 31

“ఆయన అదృశ్య లక్షణాలు, అంటే ఆయన శాశ్వత శక్తి, దైవత్వం లోకం సృష్టించబడినప్పటి నుండి స్పష్టంగా కనిపిస్తున్నాయి; ఆయన చేసినవాటిని గమనించడం ద్వారా ఆ లక్షణాల్ని తెలుసుకోవచ్చు, కాబట్టి వాళ్లకు సాకులు చెప్పే అవకాశం లేదు.”

రోమీయులు 1:20

“వీటి గురించి ధ్యానించు; వీటిలో నిమగ్నమవ్వు, అప్పుడు నీ ప్రగతి అందరికీ స్పష్టంగా కనిపిస్తుంది.”

1 తిమోతి 4:15

‘ప్రేమ చూపించేలా, మంచిపనులు చేసేలా పురికొల్పుకోవడానికి మనం ఒకరి గురించి ఒకరం ఆలోచిద్దాం. కూటాలు మానేయకుండా ఉందాం.’

హెబ్రీయులు 10:​24, 25

“మీలో ఎవరికైనా తెలివి తక్కువగా ఉంటే అతను దేవుణ్ణి అడుగుతూ ఉండాలి, అది అతనికి ఇవ్వబడుతుంది. ఎందుకంటే ఆయన కోప్పడకుండా అందరికీ ఉదారంగా ఇస్తాడు.”

యాకోబు 1:5