కీర్తనలు 144:1-15

  • విజయం కోసం ప్రార్థన

    • ‘మనిషి ఏపాటివాడు?’ (3)

    • ‘శత్రువులు చెదరగొట్టబడాలి’ (6)

    • యెహోవా ప్రజలు ధన్యులు (15)

దావీదు కీర్తన. 144  నా ఆశ్రయదుర్గమైన* యెహోవా+ స్తుతించబడాలి,ఆయనే యుద్ధం కోసం నా చేతులకు,పోరాడడానికి నా వేళ్లకు శిక్షణ ఇస్తాడు.+   నా విశ్వసనీయ ప్రేమ, నా కోట ఆయనే,ఆయనే నా సురక్షితమైన ఆశ్రయం,* నా రక్షకుడు, నా డాలు,నేను ఆయన్నే ఆశ్రయించాను,+ఆయనే దేశదేశాల ప్రజల్ని నాకు ​లోబరుస్తాడు.+   యెహోవా, నువ్వు మనిషిని గమనించడానికి అతను ఏపాటివాడు?మనుషుల్ని పట్టించుకోవడానికి వాళ్లు ఎంతటివాళ్లు?+   మనిషి కేవలం ఊపిరి లాంటివాడు;+అతని రోజులు కనుమరుగైపోయే నీడ లాంటివి.+   యెహోవా, నీ ఆకాశాన్ని వంచి కిందికి దిగు;+పర్వతాల్ని ముట్టుకొని, వాటి నుండి పొగ లేచేలా చేయి.+   నీ మెరుపుల్ని మెరిపించి శత్రువుల్ని ​చెదరగొట్టు;+నీ బాణాలు సంధించి వాళ్లను అయోమయంలో పడేయి.+   పైనుండి నీ చేతులు చాపు;ఉప్పొంగే జలాల నుండి, పరదేశుల చేతి* నుండినన్ను కాపాడు, నన్ను రక్షించు.+   వాళ్ల నోళ్లు అబద్ధాలాడతాయి,వాళ్లు తమ కుడిచెయ్యి పైకెత్తి అబద్ధ ప్రమాణం చేస్తారు.   దేవా, నేను నీకు ఒక కొత్త పాట ​పాడతాను.+ పది తంతుల వాద్యంతో నిన్ను స్తుతిస్తూ పాటలు పాడతాను.* 10  నువ్వు రాజులకు విజయం* అనుగ్రహిస్తావు,+నాశనకరమైన ఖడ్గం నుండి నీ సేవకుడైన దావీదును కాపాడతావు.+ 11  పరదేశుల చేతి నుండి నన్ను రక్షించు, నన్ను కాపాడు,వాళ్ల నోళ్లు అబద్ధాలాడతాయి,వాళ్లు తమ కుడిచెయ్యి పైకెత్తి అబద్ధ ప్రమాణం చేస్తారు. 12  అప్పుడు మా కుమారులు త్వరగా ఎదిగే మొక్కల్లా,మా కూతుళ్లు రాజభవనం కోసం చెక్కిన మూల స్తంభాల్లా ఉంటారు. 13  మా గోదాములు అన్నిరకాల పంటలతో పొంగిపొర్లుతాయి;మా పొలాల్లో మా మందలు వేల రెట్లు, లక్షల రెట్లు వృద్ధిచెందుతాయి. 14  మా చూడి ఆవులకు* ఏ హానీ జరగదు, వాటికి గర్భస్రావం కలగదు;మా సంతవీధుల్లో ఎలాంటి రోదనా ​వినపడదు. 15  ఏ ప్రజలు ఇలాంటి స్థితిలో ఉంటారో వాళ్లు ధన్యులు!* యెహోవా తమకు దేవుడిగా ఉన్న ప్రజలు ధన్యులు!+

అధస్సూచీలు

అక్ష., “బండరాయి అయిన.”
లేదా “ఎత్తైన స్థలం.”
లేదా “పట్టు.”
లేదా “సంగీతం వాయిస్తాను.”
లేదా “రక్షణ.”
లేదా “నెలలు నిండిన ఆవులకు.”
లేదా “సంతోషంగా ఉంటారు.”