కీర్తనలు 47:1-9
సంగీత నిర్దేశకునికి సూచన. కోరహు కుమారుల కీర్తన.+ శ్రావ్యగీతం.
47 సమస్త దేశాల ప్రజలారా, చప్పట్లు కొట్టండి.
విజయోత్సాహంతో దేవుణ్ణి స్తుతిస్తూ ఆనందంగా కేకలు వేయండి.
2 సర్వోన్నతుడైన యెహోవా సంభ్రమాశ్చర్యాలు పుట్టించే దేవుడు;+ఆయన భూమంతటికీ మహారాజు.+
3 దేశాల ప్రజల్ని ఆయన మన వశం చేస్తాడు;దేశాల్ని మన పాదాల కింద ఉంచుతాడు.+
4 ఆయన మన స్వాస్థ్యాన్ని, అంటే తాను ప్రేమించిన యాకోబుకు గర్వకారణంగా ఉన్నదాన్నిమనకోసం ఎంచుకుంటాడు.+ (సెలా)
5 ఆనంద కేకల మధ్య దేవుడు పైకి ఎక్కాడు;బూర* ధ్వనుల మధ్య యెహోవా పైకి ఎక్కాడు.
6 దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడండి,* ఆయన్ని స్తుతిస్తూ పాటలు పాడండి.
మన రాజును స్తుతిస్తూ పాటలు పాడండి, ఆయన్ని స్తుతిస్తూ పాటలు పాడండి.
7 ఎందుకంటే దేవుడు భూమంతటికీ రాజు;+ఆయన్ని స్తుతిస్తూ పాటలు పాడండి, లోతైన అవగాహన చూపించండి.
8 దేశాల మీద దేవుడు రాజయ్యాడు.+
దేవుడు తన పవిత్ర సింహాసనం మీద కూర్చున్నాడు.
9 దేశాల పాలకులుఅబ్రాహాము దేవుని ప్రజలతోపాటు సమకూడారు.
భూ పాలకులు* దేవునికి చెందుతారు.
ఆయన ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నాడు.+