కీర్తనలు 16:1-11

  • యెహోవా, దీవెనలకు మూలం

    • “యెహోవా నా వంతు” (5)

    • రాత్రివేళ నా ఆలోచనలు నన్ను సరిచేస్తాయి (7)

    • ‘యెహోవా నా కుడిపక్కన ఉన్నాడు’ (8)

    • “నువ్వు నన్ను సమాధిలో విడిచిపెట్టవు” (10)

దావీదు మిక్తాము.* 16  దేవా, నన్ను కాపాడు, నిన్నే నేను ఆశ్రయించాను.+   నేను యెహోవాతో ఇలా అన్నాను: “యెహోవా, నా మంచితనానికి మూలం నువ్వే.   భూమ్మీది పవిత్రులు, ప్రముఖులునాకు ఎంతో సంతోషం కలిగిస్తారు.”+   వేరే దేవుళ్లను అనుసరించేవాళ్లు ఎన్నో బాధలు అనుభవిస్తారు.+ నేను ఎన్నడూ వాటికి రక్తార్పణలు అర్పించను,నా పెదాలు వాటి పేర్లను పలకవు.+   యెహోవా నా వంతు, నాకు వచ్చిన భాగం,+ నా గిన్నె.+ నువ్వు నా స్వాస్థ్యాన్ని కాపాడతావు.   ఆహ్లాదకరమైన స్థలాలు నాకు కొలిచి ఇవ్వబడ్డాయి. అవును, నా స్వాస్థ్యంతో నేను సంతృప్తిగా ఉన్నాను.+   నాకు సలహా ఇచ్చిన యెహోవాను+ నేను స్తుతిస్తాను. రాత్రివేళ కూడా నా అంతరంగం* నన్ను సరిదిద్దుతుంది.+   నేను ఎప్పుడూ యెహోవాను నా ముందు ఉంచుకుంటాను.+ ఆయన నా కుడిపక్కన ఉన్నాడు కాబట్టి నేను ఎప్పటికీ కదిలించబడను.*+   అందుకే నా హృదయం ఉల్లాసంగా ఉంది, నా ప్రాణం* ఎంతో సంతోషిస్తుంది. నేను* సురక్షితంగా నివసిస్తున్నాను. 10  ఎందుకంటే నువ్వు నన్ను* సమాధిలో* విడిచిపెట్టవు.+ నీ విశ్వసనీయుణ్ణి గోతిని చూడనివ్వవు.*+ 11  నువ్వు నాకు జీవ మార్గాన్ని తెలియజేస్తున్నావు.+ నీ సన్నిధిలో గొప్ప ఆనందం ఉంది;+నీ కుడిచేతి దగ్గర ఎప్పటికీ సంతోషం* ఉంటుంది.

అధస్సూచీలు

పదకోశం చూడండి.
లేదా “లోతైన భావోద్వేగాలు.” అక్ష., “మూత్రపిండాలు.”
లేదా “తడబడను.”
అక్ష., “నా మహిమ.”
లేదా “నా శరీరం.”
లేదా “నా ప్రాణాన్ని.”
లేదా “షియోల్‌లో,” అంటే మానవజాతి సాధారణ సమాధిలో. పదకోశం చూడండి.
లేదా “కుళ్లిపోనివ్వవు” అయ్యుంటుంది.
లేదా “ఆహ్లాదం.”