కీర్తనలు 33:1-22

  • సృష్టికర్తను స్తుతించడం

    • “ఆయనకు ఒక కొత్త పాట పాడండి” (3)

    • యెహోవా తన మాటతో, ఊపిరితో సృష్టిని చేశాడు (6)

    • యెహోవా ప్రజలు సంతోషంగా ఉంటారు (12)

    • యెహోవా కళ్లు గమనిస్తూ ఉంటాయి (18)

33  నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందంతో కేకలు వేయండి.+ నిజాయితీ గలవాళ్లు ఆయన్ని స్తుతించడం సరైనది.   వీణతో* యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి;పది తంతుల వాద్యంతో ఆయన్ని స్తుతిస్తూ పాటలు పాడండి.*   ఆయనకు ఒక కొత్త పాట పాడండి;+ఆనందంతో కేకలు వేస్తూ తంతుల్ని నైపుణ్యంగా వాయించండి.   ఎందుకంటే, యెహోవా మాట సత్యమైనది,+ఆయన చేసేవన్నీ నమ్మదగినవి.   ఆయన నీతిన్యాయాల్ని ప్రేమిస్తాడు.+ భూమి యెహోవా విశ్వసనీయ ప్రేమతో నిండివుంది.+   యెహోవా మాటతో ఆకాశం చేయబడింది,+ఆయన నోటి ఊపిరితో* దానిలోని ప్రతీది* చేయబడింది.   ఆయన సముద్రం నీళ్లను ఆనకట్టలా పోగుచేస్తాడు;+ఉప్పొంగే జలాల్ని గోదాముల్లో ఉంచుతాడు.   భూమంతా యెహోవాకు భయపడాలి.+ భూనివాసులు ఆయన్ని బట్టి సంభ్రమాశ్చర్యాలకు లోనవ్వాలి.   ఆయన మాట అన్నాడు, అవి ఉనికిలోకి వచ్చాయి;+ఆయన ఆజ్ఞాపించాడు, అవి స్థిరపర్చబడ్డాయి.+ 10  యెహోవా దేశాల కుట్రల్ని* భగ్నం చేశాడు;+దేశదేశాల ప్రజల ప్రణాళికల్ని* పాడు చేశాడు.+ 11  కానీ యెహోవా నిర్ణయాలు* ఎప్పటికీ నిలుస్తాయి;+ఆయన హృదయాలోచనలు తరతరాలు ఉంటాయి. 12  యెహోవా దేవునిగా ఉన్న దేశం,తన సొత్తుగా ఆయన ఎంచుకున్న ప్రజలు+ సంతోషంగా ఉంటారు.+ 13  యెహోవా పరలోకం నుండి కిందికి చూస్తాడు;ఆయన మనుషులందర్నీ గమనిస్తాడు.+ 14  ఆయన తన నివాస స్థలం నుండిభూనివాసుల్ని జాగ్రత్తగా పరిశీలిస్తాడు. 15  అందరి హృదయాల్ని చేసేది ఆయనే;ఆయన వాళ్ల పనులన్నిటినీ పరిశీలిస్తాడు.+ 16  కేవలం పెద్ద సైన్యం వల్ల రాజు,గొప్ప శక్తి వల్ల వీరుడు రక్షించబడడు.+ 17  గుర్రంతో విజయం* లభిస్తుందని అనుకోకు, అది నిన్ను మోసం చేస్తుంది;+దాని గొప్ప బలంతో అది రౌతును తప్పించలేదు. 18  ఇదిగో! యెహోవా కళ్లు తన పట్ల భయభక్తులుగల వాళ్లను,తన విశ్వసనీయ ప్రేమ కోసం ఎదురుచూస్తున్న వాళ్లను గమనిస్తాయి;+ 19  మరణం నుండి వాళ్లను రక్షించడానికి,కరువు సమయంలో వాళ్లను సజీవంగా ఉంచడానికి+ ఆయన అలా గమనిస్తాడు. 20  మనం యెహోవా కోసం కనిపెట్టుకొని ఉన్నాం. ఆయనే మన సహాయకుడు, మన డాలు.+ 21  ఆయన్ని బట్టి మన హృదయాలు ఉల్లసిస్తున్నాయి,ఎందుకంటే, మనం ఆయన పవిత్రమైన పేరు మీద నమ్మకం పెట్టుకున్నాం.+ 22  యెహోవా, మేము నీ కోసం ఎదురుచూస్తూ ఉన్నాం,+అలాగే నీ విశ్వసనీయ ప్రేమ మా మీద ఎప్పటికీ ఉండాలి.+

అధస్సూచీలు

ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.
లేదా “సంగీతం వాయించండి.”
పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.
లేదా “దాని సైన్యమంతా.”
లేదా “ఆలోచనల్ని.”
లేదా “సలహాను.”
లేదా “ఆలోచనలు.”
లేదా “రక్షణ.”