కీర్తనలు 58:1-11

  • భూమికి తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు

    • చెడ్డవాళ్లను శిక్షించమని ప్రార్థన (6-8)

సంగీత నిర్దేశకునికి సూచన; “నాశనం చేయకు” అనే రాగంలో పాడాలి. దావీదు కీర్తన. మిక్తాము.* 58  మనుషులారా, మీరు మౌనంగా ఉంటూ నీతి గురించి ఎలా మాట్లాడగలరు?+ నిజాయితీగా ఎలా తీర్పు తీర్చగలరు?+   మీరు మీ హృదయంలో అవినీతిని పెంచి పోషిస్తున్నారు,+మీ చేతులు దేశాన్ని దౌర్జన్యంతో నింపేశాయి.+   దుష్టులు పుట్టినప్పటి* నుండే దారి తప్పుతారు;*వాళ్లు పుట్టుకతోనే తప్పుదారిలో వెళ్తారు, అబద్ధాలాడతారు.   వాళ్ల మాటలు పాము విషం లాంటివి;+చెవులు మూసుకున్న తాచుపాములా వాళ్లు చెవిటివాళ్లు.   పాములోడు ఎంత నేర్పుగా మంత్రం వేసినా,అది అతని స్వరం వినదు.   దేవా, వాళ్ల పళ్లు రాలగొట్టు! యెహోవా, ఈ కొదమ సింహాల దవడలు విరగ్గొట్టు!   పారే నీళ్లలా వాళ్లు కనబడకుండా పోవాలి. ఆయన తన విల్లును వంచి, తన బాణాలతో వాళ్లను పడగొట్టాలి.   వాళ్లు, వెళ్తూవెళ్తూ కరిగిపోయే నత్తలా ఉండాలి;గర్భంలోనే చనిపోయి ఎప్పుడూ సూర్యుణ్ణి చూడని బిడ్డలా ఉండాలి.   ముళ్లకంపల సెగ మీ వంటపాత్రలకు తగలకముందే,ఆయన పచ్చి కట్టెల్ని, మండే కట్టెల్ని పెనుగాలి ఊడ్చేసినట్టు ఊడ్చేస్తాడు.+ 10  దేవుడు దుష్టుల మీద పగ తీర్చుకోవడం చూసి నీతిమంతులు సంతోషిస్తారు;+నీతిమంతుల పాదాలు వాళ్ల రక్తంతో తడుస్తాయి.+ 11  అప్పుడు ప్రజలు ఇలా అంటారు: “నీతిమంతులు ఖచ్చితంగా ప్రతిఫలం పొందుతారు.+ నిజంగా లోకానికి తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు.”+

అధస్సూచీలు

పదకోశం చూడండి.
అక్ష., “గర్భంలో ఉన్నప్పటి.”
లేదా “అవినీతిపరులుగా ఉంటారు.”