కీర్తనలు 93:1-5

  • యెహోవా పరిపాలనా వైభవం

    • “యెహోవా రాజయ్యాడు!” (1)

    • ‘నీ జ్ఞాపికలు నమ్మదగినవి’ (5)

93  యెహోవా రాజయ్యాడు!+ ఆయన వైభవాన్ని వస్త్రంలా వేసుకున్నాడు;యెహోవా బలాన్ని ధరించాడు.ఆయన దాన్ని దట్టీలా కట్టుకున్నాడు. భూమి* స్థిరంగా స్థాపించబడింది;దాన్ని కదిలించలేరు.*   చాలాకాలం క్రితమే నీ సింహాసనం స్థిరపర్చబడింది;+ఎప్పటినుండో నువ్వు ఉనికిలో ఉన్నావు.+   యెహోవా, నదులు ఉప్పొంగాయి,నదులు ఉప్పొంగి ఘోషించాయి;నదులు ఉప్పొంగుతూ హోరెత్తుతూ ఉన్నాయి.   అనేక జలాల శబ్దం కన్నా,పోటెత్తే సముద్ర తరంగాల శక్తి కన్నా+పరలోకంలో యెహోవా మహిమాన్వితుడు.+   నీ జ్ఞాపికలు ఎంతో నమ్మదగినవి.+ యెహోవా, పవిత్రత ఎల్లకాలం నీ మందిరాన్ని అలంకరిస్తుంది.*+

అధస్సూచీలు

లేదా “పండే భూమి.”
లేదా “అది ఊగిసలాడదు.”
లేదా “మందిరానికి తగినది.”