కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

1వ ప్రశ్న

దేవుడు ఎవరు?

“యెహోవా అనే పేరున్న నువ్వు మాత్రమే భూమంతటి పైన మహోన్నతుడివని ప్రజలు తెలుసుకోవాలి.”

కీర్తన 83:18

“యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఆయనే మనల్ని చేశాడు, మనం ఆయన వాళ్లం.”

కీర్తన 100:3

“నేను యెహోవాను. ఇదే నా పేరు; నా మహిమను నేను ఎవ్వరికీ ఇవ్వను, నాకు రావాల్సిన స్తుతిని చెక్కిన విగ్రహాలకు చెందనివ్వను.”

యెషయా 42:8

“యెహోవా పేరు ఉపయోగించి ప్రార్థించే ప్రతీ ఒక్కరు రక్షించబడతారు.”

రోమీయులు 10:13

“నిజమే, ప్రతీ ఇంటిని ఎవరో ఒకరు కడతారు; అయితే అన్నిటినీ కట్టింది దేవుడే.”

హెబ్రీయులు 3:4

“మీ కళ్లు పైకెత్తి ఆకాశాన్ని చూడండి. వీటిని ఎవరు సృష్టించారు? వాటిలో ఒక్కోదాన్ని లెక్కపెడుతూ వాటి సైన్యాన్ని బయటికి తీసుకొస్తున్న దేవుడే కదా; ఆయన వాటన్నిటినీ పేరు పెట్టి పిలుస్తాడు. ఆయనకు అపారమైన శక్తి, సంభ్రమాశ్చర్యాలు పుట్టించే బలం ఉన్నాయి కాబట్టి వాటిలో ఒక్కటి కూడా తప్పిపోదు.”

యెషయా 40:26