కీర్తనలు 57:1-11

  • అనుగ్రహం కోసం విన్నపం

    • దేవుని రెక్కల కింద ఆశ్రయం (1)

    • శత్రువులు వాళ్ల వలలో వాళ్లే చిక్కుకున్నారు (6)

సంగీత నిర్దేశకునికి సూచన; “నాశనం చేయకు” అనే రాగంలో పాడాలి. దావీదు కీర్తన. మిక్తాము.* దావీదు సౌలు నుండి పారిపోయి గుహలో దాక్కున్నప్పటిది.+ 57  దేవా, నా మీద దయ చూపించు, నా మీద అనుగ్రహం చూపించు,నిన్నే నేను ఆశ్రయంగా చేసుకుంటున్నాను,+కష్టాలు తీరిపోయేవరకు నీ రెక్కల చాటున దాక్కుంటాను.+   సర్వోన్నతుడైన దేవునికి,నా కష్టాలు తీర్చే సత్యదేవునికి నేను మొరపెట్టుకుంటున్నాను.   పరలోకం నుండి ఆయన నాకు సహాయం చేస్తాడు, నన్ను కాపాడతాడు.+ నా మీద దాడిచేసేవాళ్లను అయోమయంలో పడేస్తాడు. (సెలా) దేవుడు తన విశ్వసనీయ ప్రేమను, నమ్మకత్వాన్ని చూపిస్తాడు.+   సింహాలు నన్ను చుట్టుముట్టాయి;+నన్ను మింగేయాలని చూస్తున్నవాళ్ల మధ్య నేను పడుకోవాల్సి వస్తోంది,వాళ్ల పళ్లు ఈటెలు, బాణాలు;వాళ్ల నాలుక పదునైన కత్తి.+   దేవా, నువ్వు ఆకాశానికి పైగా హెచ్చించబడాలి;నీ మహిమ భూమంతా నిండిపోవాలి.+   నా పాదాలు చిక్కుకునేలా వాళ్లు వల పన్నారు;+వేదనతో నా ప్రాణం కృంగిపోయింది.+ వాళ్లు నా దారిలో గుంట తవ్వారు,అందులో వాళ్లే పడిపోయారు.+ (సెలా)   దేవా, నా హృదయం స్థిరంగా ఉంది,+నా హృదయం స్థిరంగా ఉంది. నేను పాట పాడతాను, సంగీతం వాయిస్తాను.   నా అంతరంగమా,* మేలుకో. తంతివాద్యమా, మేలుకో; వీణా,* నువ్వు కూడా మేలుకో. నేను వేకువను నిద్ర లేపుతాను.+   యెహోవా, దేశదేశాల ప్రజల మధ్య నిన్ను స్తుతిస్తాను;+దేశాల మధ్య నిన్ను స్తుతిస్తూ పాటలు పాడతాను.*+ 10  ఎందుకంటే నీ విశ్వసనీయ ప్రేమ గొప్పది, అది ఆకాశమంత ఉన్నతమైనది,+నీ నమ్మకత్వం మేఘాల్ని తాకుతుంది. 11  దేవా, నువ్వు ఆకాశానికి పైగా హెచ్చించబడాలి;నీ మహిమ భూమంతా నిండిపోవాలి.+

అధస్సూచీలు

పదకోశం చూడండి.
అక్ష., “మహిమా.”
ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.
లేదా “సంగీతం వాయిస్తాను.”