కీర్తనలు 125:1-5

  • యెహోవా తన ప్రజల్ని రక్షిస్తాడు

    • “యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్టు” (2)

    • “ఇశ్రాయేలు మీద శాంతి ఉండాలి” (5)

యాత్ర కీర్తన. 125  యెహోవా మీద నమ్మకం ​పెట్టుకునేవాళ్లు,కదల్చబడకుండా ఎప్పటికీ నిలిచివుండేసీయోను పర్వతంలా ఉన్నారు.+   యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్టు,+యెహోవా తన ప్రజల చుట్టూ ఉంటాడు;+ఇప్పటినుండి సదాకాలం అలా ఉంటాడు.   నీతిమంతులకు కేటాయించిన భూమిలో దుష్టుల రాజదండం నిలవదు,లేకపోతే, నీతిమంతులు తప్పు చేయడం మొదలుపెడతారు.+   యెహోవా, మంచివాళ్లకు,హృదయంలో నిజాయితీ ఉన్నవాళ్లకు మంచి చేయి.+   వంకర మార్గాల్లోకి మళ్లే వాళ్లను యెహోవాతప్పుచేసే వాళ్లతో పాటు నాశనం చేస్తాడు.+ ఇశ్రాయేలు మీద శాంతి ఉండాలి.

అధస్సూచీలు