కీర్తనలు 70:1-5

  • త్వరగా సహాయం చేయమని విన్నపం

    • “నా తరఫున త్వరగా చర్య తీసుకో” (5)

సంగీత నిర్దేశకునికి సూచన. జ్ఞాపకార్థంగా ఉండేందుకు* దావీదు కీర్తన. 70  దేవా, నన్ను కాపాడు;యెహోవా, నాకు సహాయం చేయడానికి త్వరగా రా.+   నా ప్రాణం తీయాలని చూసేవాళ్లుసిగ్గుపడాలి, అవమానాలపాలు అవ్వాలి. నా ఆపద చూసి సంతోషించేవాళ్లుఅవమానంతో పారిపోవాలి.   “ఆహా! ఆహా!” అనేవాళ్లు సిగ్గుతో వెనక్కి వెళ్లిపోవాలి.   కానీ నిన్ను వెదికేవాళ్లునిన్ను బట్టి సంతోషించి, ఉల్లసించాలి.+ నీ రక్షణ కార్యాల్ని ప్రేమించేవాళ్లు “దేవుడు ఘనపర్చబడాలి!” అని ఎప్పుడూ చెప్పాలి.   అయితే నేను నిస్సహాయుణ్ణి, దీనస్థితిలో ఉన్నాను;+దేవా, నా తరఫున త్వరగా చర్య తీసుకో.+ నా సహాయకుడివి, రక్షకుడివి నువ్వే;+యెహోవా, ఆలస్యం చేయకు.+

అధస్సూచీలు

లేదా “జ్ఞాపకం చేసేందుకు.”